చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలంలోని బసవయ్య పాలెంలోని గోదాంలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 100 టన్నుల రేషన్ బియ్యాన్ని శ్రీకాళహస్తి రెండో పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. బియ్యం సంచులను మార్చి పెద్ద ఎత్తున బియ్యం నిల్వ ఉంచడం గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: Rayala Cheruvu Repair: రాయల చెరువు గండికి.. కొనసాగుతున్న మరమ్మతులు