నిఘానీడలో ప్రయాణం
మహిళల భద్రతకు ఏపీఎస్ఆర్టీసీ పెద్దపీట వేస్తోంది. బస్సుల్లో ప్రయాణించే మహిళల భద్రత కోసం ఇప్పటికే పలు చర్యలు తీసుకున్న ఆర్టీసీ మరిన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. మహిళల కోసం బస్సుల్లో ప్రత్యేకంగా సీట్లను కేటాయించారు. ఎక్కువగా రద్దీగా ఉండే సిటీ బస్సుల్లో మహిళలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు బస్సును రెండుగా విభజించి ముందు భాగాన్ని మహిళలకు కేటాయించారు. పురుషులు ఎవరూ మహిళల సీట్లలో కూర్చోకుండా ఉండేలా నిబంధనలు విధించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సమాచారాన్ని తెలియజేసేందుకు హెల్ప్ లైన్ నెంబర్లను ఇప్పటికే ఏర్పాటు చేసి అమలు చేస్తోంది.ఇప్పటికే కొన్ని బస్సుల్లో నిఘా నేత్రాలు ఏర్పాటు చేయగా దశలవారీగా అన్ని బస్సుల్లో కెమరాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఈ వ్యవస్థ పనిచేసే విధానంపై ఉన్నతాధికారులు అధ్యయనం చేస్తున్నారు. సాంకేతిక సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించిన తర్వాత దశలవారీగా అన్ని బస్సుల్లో అధునాతన జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా బస్సుల్లో ప్రయాణించే మహిళలకు మరింత భద్రత చేకూరడం ద్వారా భరోసా తో కూడిన ప్రయాణం సాకార మవుతుందని అధికారులు అభిప్రాయ పడుతున్నారు.
ఇదీ చదవండి