రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి.భానుడి భగభగలతో ప్రజలు భయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఎండ తీవ్రతతో పాటు వడగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక మూగ జీవాల సంగతి చెప్పనక్కర్లేదు. మేసేందుకు మేతలేక, తాగేందుకు నీరులేక తల్లడిల్లిపోతున్నాయి. ఎండ వేడిన తట్టుకోలేని మూగజీవాలు ప్రకాశం జిల్లాలో చెట్లకిందే సేద తీరుతున్నాయి. భానుడి ప్రతాపంతో నెల్లూరు జిల్లా అగ్ని గోళంలా తయారైంది. ఎన్నడూ లేని విధంగా ఎండకాస్తుండటంతో ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఉదయం పది గంటలనుంచే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండనుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. నిన్న జిల్లాలో అత్యధికంగా 48 డిగ్రీల ఉష్టోగ్రత నమోదైందంటే భానుడి తీవ్రత ఏస్థాయిల ఉందో అర్థం చేసుకోవచ్చు. నేడు రాష్ట్రంలో పలుచోట్ల అత్యధిక ఉష్టోగ్రతలు నమోదయ్యాయి. 158 చోట్ల 40 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కడపలో అత్యధికంగా 45 డిగ్రీలు నమోదయ్యాయి.
రాష్ట్రంలో పలుచోట్ల నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు
కర్నూలు 44 డిగ్రీలు
విజయవాడ 42 డిగ్రీలు
అమరావతి 42 డిగ్రీలు
గుంటూరు 42 డిగ్రీలు
విజయనగరం 42 డిగ్రీలు
రాజమహేంద్రవరం 41 డిగ్రీలు
నెల్లూరు 41 డిగ్రీలు
అనంతపురం 41 డిగ్రీలు
తిరుపతి 41 డిగ్రీలు
శ్రీకాకుళం 40 డిగ్రీలు
కాకినాడ 40 డిగ్రీలు
ఒంగోలు 40 డిగ్రీలు
విశాఖ 38 డిగ్రీలు
ఇదీచదవండి