పాలీసెట్-2019 ఫలితాలు విడుదలయ్యాయి. పాలీసెట్ ఫలితాల్లో 82 శాతం బాలురు, 87 శాతం బాలికల ఉత్తీర్ణత సాధించారు. మొదటి 10 ర్యాంకుల్లో ఏడుగురు బాలురు, ముగ్గురు బాలికలున్నారు. రాష్ట్రంలో మొత్తం 295 పాలిటెక్నిక్ కళాశాలల్లో 75వేల 971 సీట్లు ఉన్నాయి. ఈ నెల 24న కౌన్సెలింగ్ ప్రారంభించనున్నారు. జూన్ 6న తరగతులు ప్రారంభం కానున్నాయి.
మొదటి 10 ర్యాంకులు సాధించిన విద్యార్థులు...
మొదటి ర్యాంకు చింత శివ మాధవ్(తూర్పుగోదావరి), రెండో ర్యాంకు ఫణి హేరంభనాథ్(గుంటూరు), మూడో ర్యాంకు చందనం విష్ణు వివేక్(తూర్పుగోదావరి), నాలుగో ర్యాంకు ఎల్.ఎస్.చైత్ర(పశ్చిమగోదావరి) ఐదో ర్యాంకు ఆకెళ్ల వి.ఎస్.శ్రీనివాస్(పశ్చిమగోదావరి), ఆరో ర్యాంకు లింగాల ఎస్.ఆర్.అనంత్(పశ్చిమగోదావరి), ఏడో ర్యాంకు చందన వి.ఎన్.హిరణ్మయి(తూర్పుగోదావరి), ఎనిమిదో ర్యాంకు వాడపల్లి ఎస్.ఆదిత్య(తూర్పుగోదావరి), తొమ్మిదో ర్యాంకు అప్పరి హర్షిత(పశ్చిమగోదావరి), పదో ర్యాంకు పితాని గుణ(పశ్చిమగోదావరి).