ETV Bharat / state

రీపోలింగ్ 81.48శాతం....నేటి నుంచే లెక్కింపునకు ఏర్పాట్లు - రీపోలింగ్ 81.48శాతం....నేటి నుంచే లెక్కింపుకు ఏర్పాట్లు

ఆంధ్రప్రదేశ్ లోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మెుత్తం 81.48శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.

గోపాలకృష్ణ ద్వివేది
author img

By

Published : May 7, 2019, 6:04 AM IST

Updated : May 7, 2019, 8:59 AM IST

ఆంధ్రప్రదేశ్‌లోని 5 కేంద్రాల్లో రీపోలింగ్‌ ముగిసింది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో 5,064 మంది ఓటర్లు ఉండగా, 4,126 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీరిలో 1990మంది పురుషుల కాగా, 2,136 మంది మహిళలు. మెుత్తం 81.48 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. రీపోలింగ్ జరిగిన ఐదు కేంద్రాల్లో ఎక్కడ కూడా ఈవీఎంలు, శాంతిభద్రతల సమస్యలు తలెత్తలేదని ఆయన చెప్పారు. గుంటూరు జిల్లా నరసరావు పేట పరిధిలోని కేశనపల్లి కేంద్రంలో అత్యధికంగా 89.23శాతం ఓట్లు పోలయ్యాయి. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో పరిధిలోని కలనూతల కేంద్రంలో మినహా మిగతా అన్ని చోట్ల ఆరింటికే ఓటింగ్ ముగిసింది.
ఎన్నికల లెక్కింపు ప్రక్రియ‌కు నేటి నుంచి ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది తెలిపారు. ఓట్ల లెక్కింపు చేపట్టే సిబ్బందికి శిక్షణ ఇస్తామన్నారు. కౌంటింగ్ సిబ్బందిని రెండు ద‌శ‌ల్లో ర్యాండమైజేషన్‌ ద్వారా ఎంపిక‌ చేశామని వివరించారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఓట్లు లెక్కించేందుకు 180 మంది సిబ్బంది అవ‌స‌రం ఉందన్నారు. మొత్తం కౌంటింగ్ ప్రక్రియకు 25 వేల మంది సిబ్బంది అవ‌స‌రమన్న ద్వివేది... ఏ ఉద్యోగి ఏ నియోజకవర్గం ఓట్లు లెక్కిస్తారో ఈనెల 23న తెలుస్తుందన్నారు.

గోపాలకృష్ణ ద్వివేది

ఏం చేయాలో అధికారులే నిర్ణయించుకోవాలి....
ఎన్నికల వేళ ఏం చేయాలో, ఏం చేయకూడదో తాము అధికారులకు చెప్పడం లేదని ద్వివేది అన్నారు. అధికారులకు నియమావళి పుస్తకాలను అందించామని, వాటిని చదవి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఎవరికైనా సందేహం ఉంటే , అధికారికంగా లేఖ రాస్తే దాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపి స్పష్టత తీసుకుంటామన్నారు. గ్రూప్-2 పరీక్షలో ప్రభుత్వ పథకాలపై ప్రశ్నలు ఇచ్చిన దాని పై ఫిర్యాదు వచ్చిందని, ఈ విషయంపై నివేదిక తెప్పిస్తామని చెప్పారు.

ఏ కేంద్రంలో ఎంతెంత...

* గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం పరిధిలోని కేశనపల్లిలో మొత్తం 956 మంది ఓటర్లల్లో 853 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 89.23 శాతం పోలింగ్‌ నమోదైంది.
* నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం పరిధిలో ఇసుకపాలెంలోని పోలింగ్‌ కేంద్రంలో 1084 ఓట్లకు గానూ 819 ఓట్లు పోలయ్యాయి. 75.55 శాతం పోలింగ్‌ నమోదైంది.
* గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలో నల్లచెరువు పోలింగ్‌ కేంద్రంలో 1396 మంది ఓటర్లలో 1,053 మంది తమ ఓటు వేశారు. 75.4 శాతం పోలింగ్‌ నమోదైంది.
* ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం పరిధిలోని కలనూతలలో 1070 మంది ఓటర్లలో 809 మంది ఓటు వేశారు. 75.61 శాతం పోలింగ్ నమోదైంది.
* నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం పరిధిలోని అటకానితిప్పలో 558 ఓట్లకు గాను 464 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ 83.15 శాతం పోలింగ్ నమోదైంది.

ఇవి చదవండి...సార్వత్రిక ఐదో దశలో 63.56 % పోలింగ్

Intro:Ap_Nlr_07_05_Mugisina_Repolling_Kiran_Av_C1

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నెల్లూరు జిల్లాలో రే పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని బుచ్చిరెడ్డిపాలెం మండలం ఇసుక పాళెంలోని 41వ బూత్ లో జరిగిన రీ పోలింగ్ లో 75.55శాతం పోలింగ్ నమోదైంది. ఈ బూత్ లో 1084ఓట్లు ఉండగా, 819 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గత నెల 11వ తేదీన జరిగిన ఎన్నికల్లో 76.66 శాతం ఓటింగ్ జరగ్గా, ఈసారి పోలింగ్ శాతం కాస్త తగ్గింది. రీపోలింగ్ కు అధికారులు ప్రతిష్ట భద్రత కల్పించారు. వెబ్ క్యాస్టింగ్ తో పాటు డోన్ కెమెరాలతో పోలింగ్ తీరును పరిశీలించారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎం మిషన్లను డి.కె.డబ్ల్యూ. కళాశాలలోని స్ట్రాంగ్ రూంకు తరలించారు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
Last Updated : May 7, 2019, 8:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.