ETV Bharat / state

'మత సామరస్యంతో యాదాద్రి నిర్మాణం' - యాదాద్రి

శిలలపై శిల్పాలు చెక్కినారూ... మనవాళ్లు సృష్టికే అందాలు తెచ్చినారు అంటూ వీనులవిందైన పాతపాటను ఎప్పుడు విన్నా సరికొత్తగానే ఉంటుంది. వింటేనే అంత అనుభూతి కలిగితే … మరి చూస్తే… మరెంత అద్భుతంగా ఉంటుందో కదా ! ఆ అద్భుతమే యాదాద్రిలో రూపుదిద్దుకుంటోంది.

'మత సామరస్యంతో యాదాద్రి నిర్మాణం'
author img

By

Published : Jun 16, 2019, 11:00 AM IST

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి నృసింహ స్వామి ఆలయాభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎక్కడెక్కడినుంచో ఎంపికచేసుకుని మరీ రప్పించిన స్తపతులు, ఆర్కిటెక్చరర్లు, శిల్పాచార్యులు, శిల్పులు, వివిధ పనివాళ్లు, రకరకాల యంత్రాలు, భారీ యంత్రాలతో పనిచేసే నిపుణులతో ఆలయ నిర్మాణం సాగుతోంది. దాదాపు 1500 మంది శిల్పులు తమ ఉలులకు పని కల్పించారు. అతను, ఆమె... ఎంకటేశో, గుట్టెనక ఏసోబో, పీర్లచావిడి వీధి రెహమానో, పంజాబ్‌ నుంచి వలసకూలిగా వచ్చిన తన్వీర్‌సింగో, చెన్నై నుంచి సుత్తి-ఉలి చేతపట్టుకుని వచ్చిన తంగవేలో, రాజస్థాన్‌ గడపదాటి వచ్చిన ఇల్లాలు హీరాబాయి... ఎవరైతేనేం... వారి చేతి ఉలులు, సుత్తులూ రాళ్లపై రాగాలు పలికిస్తున్నాయి.

మతాలతో పని లేదు... అంతా ఉలితోనే

వీళ్లెవ్వరూ ఏ హిందూ మతగ్రంథాలను చదువలేదు. రెక్కాడితేనే డొక్కాడును అనే జీవిత పాఠాలు మాత్రమే చదివారు. చోళ, పల్లవ, విజయనగర సామ్రాజ్య చరితలను ఎరుగరు. ఎండనక వాననక కష్టంచేస్తే ఆ పూట కంచంలో అన్నం అనే దినసరి చరిత్ర మాత్రమే ఎరుగుదురు. నాగరశైలి గోపురమో, వేసరశైలీ ప్రాకారమో, ద్రావిడశైలీ విమానమో తెలియదు వాళ్లకు. వాళ్లకు తెలిసిందల్లా ఎవరి చెమటబిందువైనా ఉప్పుప్పగానే ఉంటుందని, రాళ్లదెబ్బలకు కారే నెత్తురు ఎవరిదైనా ఎర్రగానే ఉంటుందని. శైవాగమమా, పాంచరాత్రాగమమా, వైఖానసాగమమా… ఏమో ఎప్పుడూ వినని పదాలవి. అయినా స్తపతిగారు చెప్పినట్లు శిల్పం చెక్కడమే వారి పని. మతమేదైనా, కులమేదైనా యాదాద్రిపై ఏ రాయి ముందో ఒంటికాలిపై కూర్చుని సుత్తి శానం ఉలి పట్టుకుంటే చాలు ఆ రాయి వైష్ణవ దేవుడుగానో, శైవ దేవతగానో, శక్తిరూప అమ్మవారుగానో మారిపోతుందంతే.

రాష్ట్రం నుంచి ఏక జాతి శిలలు...

యాదగిరీశుని అనంత తత్వానికి ఎల్లలు, సరిహద్దులూ లేవు. తెలంగాణ యాదగిరిగుట్టపైన లక్ష్మీనారసింహునికి సీమాంధ్ర గుంటూరు దాపునున్న గురిజేపల్లి గని రెండున్నర లక్షల టన్నుల ఏకజాతి శిలను అందించింది. కృష్ణశిల జాతికి చెందిన ఒకే విధమైన రాయిని శిల్పాలుగా, స్తంభాలు, ప్రాకారాలుగా, గోపురాలుగా మలుస్తున్నారు.

శిలలు... శిల్పాలుగా...

తెలంగాణ ప్రభుత్వం ఆశించి ప్రారంభించిన యాదాద్రి ఆలయాభివృద్ధి ప్రాజెక్ట్‌, నృసింహభక్తుల కలల వాస్తవ రూపం, ఆధ్యాత్మిక పర్యటక జాబితాలో చేరుతున్న మరో అపురూప దేవాలయ రూపకల్పన శరవేగంగా సాగుతోంది. వందలాది శిల్పకారుల పనితనంతో చెక్కిన లతాయుక్త స్తంభాలు, రాతి పద్మపీఠాలు, ముఖాకృత ఏనుగు భారవాహులు, వాటిపై పూన్చిన ప్రాకారాలు, అష్టకాళ్ల మంటపాలు, దేవీదేవతల శిల్పాకృతులు, మూలవిరాట్టులు, ప్రాకారదేవతావిగ్రహాలు, ఉత్సవబేరాలు ఇలా ఎన్నో సునిశితంగా శిల్పితమై ఉన్నాయి. యాదగిరి గుట్టకు ఆరువైపులా నిర్వహిస్తున్న ఆరు కేంద్రాలలో బండరాళ్లన్నీ శిల్పాలుగా తయారై భారీ యంత్రాల సాయంతో కొండపైకి ఎక్కాయి. స్తపతులు, ఆర్కిటెక్చర్ల సూచనలకు అనుగుణంగా బారులుతీరి నిలుచుంటున్నాయి.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.