ETV Bharat / state

నేడు గుంటూరులో ప్రభుత్వ ఇఫ్తార్ విందు - ap govt

నేడు గుంటూరు పోలీస్ మైదానంలో ప్రభుత్వం అధికారికంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ఈకార్యక్రమానికి సీఎం జగన్​మోహన్ రెడ్డి హాజరుకానున్నారు.

నేడు గుంటూరులో ప్రభుత్వ ఇఫ్తార్ విందు
author img

By

Published : Jun 3, 2019, 5:18 AM IST

నేడు గుంటూరులో ప్రభుత్వ ఇఫ్తార్ విందు

రంజాన్ పండగను పురస్కరించుకుని ముస్లిం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నేడు గుంటూరులో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో సాయంత్రం ఐదు గంటలకు ఇఫ్తార్ విందు ప్రారంభమవుతుంది.
ఇఫ్తార్ విందుకు రాష్ట్రం నలుమూలల నుంచి ముస్లిం మతపెద్దలు, ప్రజాప్రతినిధులను ఆహ్వానించిన నేపథ్యంలో 500 మంది వీఐపీలు, 4 వేల మందికి సరిపడా ఏర్పాట్లు చేస్త్తున్నారు. పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత సీఎం తొలిసారిగా గుంటూరుకు రానుండటంతో జిల్లా అధికార యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేపట్టింది. కార్యక్రమానికి ముందు తొలుత ముస్లిం మత పెద్దలతో కలిసి సీఎం జగన్ ప్రార్థనలు చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి.

New Delhi, June 02 (ANI): As Delhi is reeling under intense summer heat, people were seen avoiding going out of their houses. Heat wave conditions are prevailing in the region and the temperatures are above normal by almost five degrees. Due to the easterly winds blowing in most parts of Uttar Pradesh and Delhi, maximum temperatures may drop by one to two degrees Celsius in the Delhi-NCR region, while the night temperature may increase by a few degrees.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.