మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి సమీపంలో ఉన్న ప్రజావేదిక.. చట్టవ్యతిరేక నిర్మాణం అంటూ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల కిందటే కూల్చేసింది. ఇప్పుడు అదే కోవలో చంద్రబాబు నివాసం సహా కరకట్ట లోపల ఉన్న భవనాలన్నింటికీ నోటీసులిచ్చింది. నదీపరిరక్షణ చట్టాలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టారంటూ రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ- సీఆర్డీఏ భవన యజమానులకు నోటీసులు జారీ చేసింది. నోటీసులపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని అధికారులు గడువు విధించారు. సంజాయిషీ సంతృప్తికరంగా లేకుంటే తగు చర్యలు తీసుకుంటామని సీఆర్డీఏ నోటీసులో తెలిపింది.
అనుమతి లేకుండా 10 తాత్కాలిక షెడ్ల నిర్మాణం చేసినట్లు సాంకేతిక సిబ్బంది తనిఖీలో గుర్తించామని సీఆర్డీఏ తెలిపింది. కృష్ణా నది కరకట్టపై 100 మీటర్లలోపు 50కి పైగా అక్రమ కట్టడాలను సీఆర్డీఏ గుర్తించింది.
ఇది చదవండి... నేడు జగన్, కేసీఆర్‌ల కీలక భేటీ