ETV Bharat / state

ఫొని తుపాను... సమగ్ర సమాచారం - odisha

ఫొని తుపాను ఎట్టకేలకు ఒడిశాలోని పూరీ సమీపంలో తీరం దాటింది. 22కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ ప్రచండ తుపాను... గోపాలపూర్‌-చాంద్‌బలీ వద్ద పూర్తిగా తీరం దాటి కోల్‌కతా మీదుగా బంగ్లాదేశ్‌ వైపుగా పయనిస్తోంది. ప్రస్తుతం ఈ తుపాను ప్రభావంతో 200-240 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. బంగ్లాదేశ్‌కి వెళ్లేలోపే తుపాను బలహీనపడనుందని వాతావరణశాఖ తెలిపింది. బాలాసోర్‌ వద్ద తుపాను మళ్లీ సముద్రంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తోంది.

ఫొని తుపాను... సమగ్ర సమాచారం
author img

By

Published : May 3, 2019, 9:38 AM IST

Updated : May 3, 2019, 11:08 AM IST

ఉత్తరాంధ్రలో వర్షాలు...
ఫొని తుపాను కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా తేలికపాటి జల్లులు పడ్డాయి. కంచిలిలో అత్యధికంగా 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సోంపేటలో గరిష్ఠంగా 10, బాతాపురం ఎగువ 7.6, ఎంఎస్‌పల్లి 7.6, సోంపేట 7.45, ఇచ్ఛాపురం 7.22, బాతుపురం దిగువ ప్రాంతంలో 6.9 సెంటీమీటర్లు నమోదైంది. టెక్కలి ఎన్టీఆర్‌ నగర్‌లో చలిగాలులకు ఓ వృద్ధురాలు మృతిచెందింది.

ఫొని ప్రభావంతో విజయనగరం జిల్లా తెర్లాం, మెరకముడిదాం, గుర్ల, గరివిడి, డెంకాడ, నెల్లిమర్లలో గాలుల తీవ్రత పెరిగింది. భోగాపురం, పూసపాటి రేగ మండల్లాలో హై అలర్ట్‌ ప్రకటించారు. తీరప్రాంతాల్లో సముద్రపు కెరటాలు ఎగిసిపడ్డాయి. విశాఖ జిల్లాలో తుపాను ప్రభావంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి.

ఫొని మహోగ్ర రూపం...
ఫొని తుపాను మహోగ్ర రూపంతో తీరంలో ప్రచండ గాలులు విరుచుకుపడ్డాయి. శ్రీకాకుళం జిల్లాలో భీకర స్థాయికి చేరాయి. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. గాలులకు అనేక చోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. వజ్రపుకొత్తూరు మండలం భావనపాడు వద్ద సముద్రం 10 కిలోమీటర్లు ముందుకు వచ్చింది. గార మండలం బందరవానిపేటలో అలలు ఎగిసిపడ్డాయి.

పునరావాస కేంద్రాల ఏర్పాటు...
శ్రీకాకుళంలో 126కిపైగా పునరావాస కేంద్రాల ఏర్పాటు చేశారు. 20 వేల మందికి అధికారులు భోజన ఏర్పాట్లు చేశారు. తాగునీటితో పాటు విద్యుత్ జనరేటర్లు, అత్యవసర మందుల అందుబాటులో ఉంచారు. జిల్లాకు 9 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకొని సేవలందించాయి. వంద మంది వైద్య నిపుణులు, 825 మంది పారామెడికల్ సిబ్బంది ప్రజాసేవలో పాల్గొన్నారు. విద్యుత్ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదమున్నందున 10 వేల స్తంభాలను అధికారులు సిద్ధం చేశారు. అత్యవసరంగా వినియోగించేందుకు 6,800 సౌర విద్యుత్ ల్యాంపులు ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ నివాస్‌, జేసీ చక్రధర్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.

ముందుజాగ్రత్త చర్యలు...
ఫొని కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా... అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. చాలాచోట్ల విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. ఫొని గమనాన్ని పరిశీలిస్తున్న ఆర్టీజీఎస్ సహకారంతో... చాలావరకు ఆస్తి నష్టాన్ని తగ్గించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి.

ట్రాన్స్‌కో అధికారుల విజ్ఞప్తి...
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల ప్రజలకు తూర్పు ట్రాన్స్‌కో అధికారులు విజ్ఞప్తి చేశారు. తుపాను ప్రభావంతో కూలిన స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల గురించి సమాచారం అందించేందుకు టోల్ ఫ్రీ నంబరు 1912 ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం కమాండ్ కంట్రోల్ కేంద్రానికి 9490612633, విజయనగరం కమాండ్ కంట్రోల్ కేంద్రానికి 9490610102, విశాఖ కమాండ్ కంట్రోల్ కేంద్రానికి 7382299975 నంబర్​లను ఏర్పాటు చేశారు.

రైళ్లు- విమానాల రద్దు...
ఫొని తుపాను దృష్ట్యా ఒడిశాలో రైలు, విమాన సర్వీసులు రెండ్రోజులపాటు నిలిపివేశారు. కోల్‌కతా-చెన్నై మార్గంలో ప్రయాణించే 220కి పైగా రైళ్లు శనివారం వరకు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. భువనేశ్వర్, కోల్‌కతా విమానాశ్రయాలకు విమానాల రాకపోకలు నిషేధించారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అన్ని తీరప్రాంత విమానాశ్రయాలకు హెచ్చరికలు జారీ చేశారు.

రైల్వేశాఖ అప్రమత్తం...
ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు 3 ప్రత్యేక రైళ్లను కేటాయించింది రైల్వే శాఖ. అన్ని ప్రధాన స్టేషన్లలోని స్టాళ్లలో ఆహారపదార్థాలు, నీరు సిద్ధంగా ఉంచినట్లు ప్రకటించింది. మరో 3 రోజుల వరకూ సిబ్బంది సెలవులు పెట్టొద్దని రైల్వేశాఖ విజ్ఞప్తి చేసింది. తూర్పుకోస్తా రైల్వే పరిధిలో మొత్తం 157 రైళ్లు రద్దుచేశారు. తుపాను కారణంగా సికింద్రాబాద్-భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్‌ విశాఖ స్టేషన్‌లో నిలిచిపోయింది. రైల్వేస్టేషన్‌లో ప్రయాణీకులు పడిగాపులు కాశారు.

సెల్‌ సేవలకు అంతరాయం లేదు

రాష్ట్రంలో తుపాను ప్రభావం నుంచి ప్రజలను రక్షించడానికి ఆర్టీజీఎస్ నిరంతర సేవలు అందించింది. సెల్ స‌ర్వీసుల‌కు అంత‌రాయం లేకుండా ఏర్పాట్లు చేసింది. తుపాను ప్రభావిత మండలాల్లో ఇంట్రా సర్కిల్ రోమింగ్ విధానాన్ని అమలు చేసి అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసింది. ఒక ఆప‌రేట‌ర్ ట‌వ‌ర్ ప‌నిచేయ‌క‌పోయినా ఆ ప్రాంతంలోని ఇతర ఆప‌రేట‌ర్ ట‌వ‌ర్‌తో స‌ర్వీసులు అందేలా ఏర్పాట్లు చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజ‌ల‌కు ఇబ్బందులు లేకుండా అధికారులు సదుపాయాలు కల్పించేలా ఆర్టీజీఎస్ సూచనలు చేసింది.

ఒడిశా సహాయక చర్యలు...
ఫొని తుపాను ఒడిశా దిశగా దూసుకెళ్తున్న నేపథ్యంలో... నవీన్ సర్కారు సహాయక చర్యలు ముమ్మరం చేసింది. పూరీకి సమీపంలో తుపాను తీరం దాటే అవకాశం ఉండటంతో...13 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. తుపాను దృష్ట్యా ఒడిశాలో అంధకారం అలముకుంది. ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఒడిశా తీరంలో సహ్యాద్రి, రణ్‌వీర్, కడ్‌మాట్‌ యుద్ధనౌకలను మోహరించారు. వివిధ ప్రాంతాల్లో 34 సహాయక బృందాలను ఉంచిన తీరప్రాంత రక్షణ దళం... పరిస్థితిని పర్యవేక్షించింది.

బంగాల్‌ అప్రమత్తం...
ఫొని తుపాను దృష్ట్యా బంగాల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. కోల్‌కతా సహా పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. పాఠశాలలకు సెలవులు ప్రకటించిన మమతా సర్కారు... తీరప్రాంతాలకు వెళ్లొద్దని పర్యాటకులకు విజ్ఞప్తి చేసింది. దిఘా, శంకర్‌పూర్, తాజ్‌పూర్, బక్కలి ప్రజలు మట్టి ఇళ్లను ఖాళీచేయాలని ఆ రాష్ట్ర అధికారులు విజ్ఞప్తి చేశారు. ఫొని తీరాన్ని దాటేవరకూ మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని సూచించారు. 6 ఎన్డీఆర్‌ఎఫ్‌, 4 రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాల మోహరించి ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపడుతోంది. పరిస్థితిని సమీక్షించేందుకు సీఎం మమతా రెండ్రోజులు ఖరగ్‌పూర్‌లోనే ఉంటానని తెలిపింది.

ఫొని తుపాను

Intro:ap_knl_22_02_chiruta_puli_b_abb_c2
యాంకర్, నంద్యాల ఎస్సార్బిసి కాలనీలో సంచరించిన చిరుతపులి కోసం అటవీశాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు

Body:చిరుతపులి

Conclusion:8008473804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
Last Updated : May 3, 2019, 11:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.