ETV Bharat / state

తెదేపాపై నిందలు మాని.. ఏం చేస్తున్నారో చెప్పండి - assembly

తెదేపా ప్రభుత్వం హయాంలో పర్యాటకం అభివృద్ధి చెందలేదన్న మంత్రి అవంతి శ్రీనివాస్​ ఆరోపణలపై తెదేపా నేత బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. గత ప్రభుత్వంపై నిందారోపణలు కట్టిపెట్టి వైకాపా ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలన్నారు.

పర్యటకం పై సభలో చర్చ
author img

By

Published : Jul 22, 2019, 12:56 PM IST

పర్యటకం పై సభలో చర్చ

ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యాటక అభివృద్ధి కోసం రూపొందించిన అఖండ గోదావరి ప్రాజెక్టు డీపీఆర్​ను కేంద్రానికి పంపడం మినహా... తెదేపా హయాంలో నిధులు కేటాయించలేదని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ ఆరోపించారు. తెదేపా అవినీతి వల్లే కేంద్రం గతంలో రాష్ట్రానికి నిధులు ఇవ్వలేదన్నారు. చంద్రబాబు దేశ విదేశాలు తిరగడం తప్ప.. పర్యాటక శాఖను పట్టించుకోలేదని విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన అవినీతిని వెలికి తీసి.. నిధులను సక్రమంగా వినియోగిస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు.

మంత్రి వ్యాఖ్యలపై తెదేపా సభ్యుడు బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. గత ప్రభుత్వంపై నిందారోపణలు కట్టిపెట్టి.. వైకాపా ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలన్నారు. చంద్రబాబు రాష్ట్రంలోని పర్యాటకానికి ప్రత్యేక శోభ తీసుకువచ్చారని కొనియాడారు. గత ప్రభుత్వంపై నిందలు మాని పిచ్చుకలంక అభివృద్ధికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలని కోరారు.

ఇదీ చదవండి

రేషన్​ డీలర్లను తొలగించం.. స్టాకర్లుగా వాళ్లే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.