ప్రముఖ సినీనటి, దర్శకురాలు విజయనిర్మల మృతిపట్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విజయనిర్మల మృతి తెలుగు చలన చిత్రరంగానికి తీరనిలోటని విచారం వ్యక్తం చేశారు. సినీనటిగా, దర్శకురాలిగా తెలుగు ఖ్యాతిని ఇనుమడింప చేశారని కొనియాడారు. సామాజిక ఇతివృత్తాలే కథాంశంగా అనేక కుటుంబ కథాచిత్రాలకు దర్శకత్వం వహించారని చంద్రబాబు అన్నారు. ఆమె సాధించిన అవార్డులు, పురస్కారాలే విజయనిర్మల ప్రతిభకు గీటురాళ్లన్నారు. బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి అత్యున్నత స్థానానికి చేరారని చంద్రబాబు అన్నారు.
విజయనిర్మల మరణం విచారకరమని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరారు. మహిళా దర్శకురాలిగా విభిన్న చిత్రాలు తెరకెక్కించారని, సమున్నత స్థానం సాధించారని కొనియాడారు
ఇదీ చదవండి