ETV Bharat / state

2041కి తెలంగాణలో పెరగనున్న వృద్ధుల సంఖ్య - andhrapradesh 2041 budget survey

తెలుగు రాష్ట్రాలు భవిష్యత్తులో జనాభా సంక్షోభాన్ని ఎదుర్కోనున్నాయా? ప్రస్తుతం జపాన్‌ తరహాలో పని చేయగలిగే యువత సంఖ్య తగ్గి వృద్ధుల సంఖ్య పెరగనుందా? యువత సంఖ్య భారీగా తగ్గిపోనుందా? 2041 కల్లా ఆంధ్రప్రదేశ్‌లో జనాభా వృద్ధి రేటు సున్నాకు చేరనుందా.. అంటే అవుననే అంటోంది ఆర్థిక సర్వే.

2041 story
author img

By

Published : Jul 5, 2019, 9:53 AM IST

తెలుగు రాష్ట్రాల్లో లింగ నిష్పత్తి మెరుగుపడింది. ఆయుఃప్రమాణాలు పెరుగుతున్నాయి. వీటితో పాటు మరెన్నో వాస్తవాలను ఆర్థిక సర్వే కళ్లకు కట్టింది. ఈ చేదు నిజాలతో పాటు కొన్ని తీపి కబుర్లనూ అందించింది. మరణ శాతాలు తగ్గుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2041 నాటికి జనాభా వృద్ధిరేటు సున్నాకు చేరుతుందని ఆర్థిక సర్వే వెల్లడించింది. వచ్చే 2 దశాబ్దాల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో యుక్తవయస్కుల సంఖ్య 10% తగ్గిపోయి 60 ఏళ్ల పైబడిన వయోవృద్ధుల సంఖ్య పెరుగుతుందని పేర్కొంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం పార్లమెంటులో 2018-19 ఏడాది ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. అందులో వివరాలు.

  • 2015-16 నుంచి 2018-19 మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో లింగనిష్పత్తి పురోగమనంలో సాగింది. భేటీ బచావో- భేటీ పఢావో కార్యక్రమం పెద్ద రాష్ట్రాలపై మంచి ప్రభావాన్ని చూపింది. లింగనిష్పత్తి 980కి మించి ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ చేరాయి.
  • 5- 14 ఏళ్ల మధ్య వయసున్న పిల్లల్లో బడికి వెళ్లేవారి సంఖ్య దేశవ్యాప్తంగా తగ్గుముఖం పడుతూ వస్తోంది.
  • తెలంగాణలో 2001లో సగటు సంతాన సాఫల్య నిష్పత్తి 2.3% ఉన్న నిష్పత్తి 1.6%కి చేరే అవకాశం కనిపిస్తోంది.
  • ఏపీలోనూ 2.3% ఉండగా 2041 నాటికి 1.5%కి చేరనుంది.
    2041 story
    2041 story
    2041 story
    2041 story

ఇదీ చూడండి : నకిలీ విత్తన విక్రేతల మెడ చుట్టూ బిగుస్తున్న 'పీడీ'కిలి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.