ETV Bharat / state

పర్చూరులో ఒకే వ్యక్తికి మరో చోట ఓటు - బీఎల్వోలతో ఎన్నికల సంఘం విచారణ - Form 7 Applications

Voter List Inquiry With BLVs in Parchur: పర్చూరు నియోజకవర్గం.. ఈ పేరు ప్రజలకు పెద్దగా పరిచయం ఉండేది కాదు. కానీ, ఫారం - 7 దరఖాస్తులు ఈ నియోజకవర్గ పేరును సంచలనం చేశాయి. రాష్ట్రంలో అత్యధికంగా ఈ నియోజకవర్గం నుంచి ఫారం 7 దరఖాస్తులు రాగా.. వాటిని విచారించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది.

voter_list_inquiry_with_blvs_in_parchur
voter_list_inquiry_with_blvs_in_parchur
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 15, 2023, 1:33 PM IST

Voter List Inquiry With BLVs in Parchur: బాపట్ల జిల్లా పర్చూరులో ఒకే వ్యక్తి పలు చోట్ల ఓటు హక్కు కలిగి ఉండడంపై బీఎల్వోలతో విచారణ చేయించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ తరహా ఓట్లు నియోజకవర్గంలో 5 వేల వరకు ఉన్నట్లు ఎన్నికల సంఘం వివరించింది. వెంటనే ఆ ఓట్లపై విచారణ చేయించి బాధ్యులైన వ్యక్తులు.. ఒకచోట మాత్రమే ఓటు హక్కు కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

దీంతో ఒకే ఫొటోతో మరో ప్రాంతంలో ఓటు ఉన్న వారికి నోటీసులు అందించి.. విచారణ చేయనున్నట్లు ఈఆర్వో నారాయణ తెలిపారు. ఓటరు కోరుకున్న చోట ఓటు హక్కు కొనసాగించి.. మరో చోట తొలగించేలా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

పర్చూరు​లో పోలీసులకు ఫారం-7 తిప్పలు

బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ఓట్లు తొలగింపు కోరుతూ ఫారం-7 దరఖాస్తులు (Form 7 Applications) 14 వేలకు పైగా వచ్చాయి. ఇంత మొత్తంలో దరఖాస్తులు రావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నియోజకవర్గంలో 5వేల మందికి ఒకటికి మించి ఓట్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. ఈ పరిణామం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

Removal Votes in Parchur: పర్చూరు ఓట్ల దొంగలపై చర్యలకు అధికారులు మీనమేషాలు

కుస్తీ పడుతున్న అధికారులు: ఒక్క వ్యక్తే పలు చోట్ల ఓటు కలిగి ఉండడంపై అప్రమత్తమైన ఎన్నికల సంఘం.. బీఎల్వోలతో విచారణ చేయించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అందిన ఫారం-7 దరఖాస్తులపై ఇంకా విచారణ పూర్తికాలేదు. వాటి విచారణకు అధికారులు కుస్తీ పడుతున్నారు. ఇక్కడ విధులు నిర్వహించడానికి అధికారులు భారంగా భావిస్తున్నారు.

విధులు నిర్వహించలేకున్నామని ఉద్యోగుల ఆవేదన: ఉద్దేశపూర్వకంగా ఓట్లు తొలగింపు కోరుతూ దరఖాస్తులు చేస్తున్నారని.. వాటిని తప్పకుండా తొలగించాల్సిందేనని పట్టుబడుతున్నారని అధికారులు అంటున్నారు. ఈ క్రమంలో వారు విధులు నిర్వహించలేని పరిస్థితికి చేరుకున్నమని ఉద్యోగులు అంటున్నారు.

విచారణ పారదర్శకంగా నిర్వహించాలన్న ఎన్నికల సంఘం: అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి ఇప్పటికే ఎన్నికల విధుల్లో జోక్యం చేసుకున్న.. నలుగురు పోలీసు అధికారులు సస్పెండైన విషయం తెలిసిందే. ఓట్ల తొలగింపులో అధికార నేతల ఒత్తిళ్లపై విధులు నిర్వహించకూడదని ఎన్నికల సంఘం అధికారులకు సూచించింది. పరిశీలనలో వెలుగులోకి వచ్చినా.. ఏవైనా ఇతర విచారణల్లో బయటపడిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం వివరించింది. విచారణను పారదర్శకంగా నిర్వహించాలని బీఎల్పోలను ఎన్నికల అధికారులు ఆదేశించింది.

Four Police Officers Suspended: పర్చూరు నియోజకవర్గంలో ఓట్ల అక్రమాలు.. సస్పెన్షన్‌ వేటుతో సరిపెట్టేశారు

పర్చూరు నియోజకవర్గంలో ప్రతిపక్షాలకు సానుకూలంగా.. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లను గుర్తించి.. వాటిని ఓటరు జాబితా నుంచి తొలగించేందుకు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. బతికి ఉన్నావారని చనిపోయారని.. వలసలు వెళ్లిన వారి ఓట్లను సైతం తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని స్థానిక ఎమ్మెల్యే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.