ETV Bharat / state

బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, గూడ్స్​ వాహనం ఢీ

Road Accident : బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఆర్టీసీ బస్సు, బోలేరో గూడ్స్​ వాహనాలు రెండు ఎదురెదురుగా ఢీ కొనటంతో ఈ ప్రమాదం జరిగింది. అసలు ప్రమాదానికి గల కారణమేమిటంటే..

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Feb 8, 2023, 2:04 PM IST

Two Persons Died In Road Accident : బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అర్టీసీ బస్సు, బొలెరో గూడ్స్ వాహనం ఢీకొనటంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనంలోని ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కొల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం మల్లవరం గ్రామానికి చెందిన దుగ్గంపూడి వెంకటేశ్వర్ రెడ్డి, కొలగట్ల వెంకటేశ్వర్ రెడ్డి.. బొలెరో గూడ్స్ వాహనంలో నరసరావుపేట నుంచి వారి గ్రామానికి బయల్దేరారు. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలంలోని పాత మాగులూరు గ్రామ సమీపానికి రాగానే ఆర్టీసీ బస్సు, వీరీ బోలెరో వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో బోలెరోలోని వ్యక్తులిద్దరూ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆర్టీసీ బస్సు గుంతకల్ నుంచి విజయవాడ వెళుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు.

బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగగా.. పొగమంచే ప్రమాదానికి కారణమని పోలీసులు అంచనాకు వచ్చారు. ఉదయం వేళ పొగమంచు అధికంగా ఉండటంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక పోవటంతోనే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.