Pregnant Woman Gang Rape Case : ఉపాధి దారి వెతుక్కుంటూ.. భర్త, పిల్లలతో కలిసి రైల్వేస్టేషన్‌లో ఆశ్రయం పొందేందుకు వచ్చిన గర్భిణిపై అర్ధరాత్రి మానవ రూపంలో ఉన్న మృగాలు మద్యం మత్తులో విరుచుకుపడ్డాయి. భర్తను నెట్టేసి.. ప్రాణం తీస్తామని బెదిరించి.. ఆమెను పెడరెక్కలు విరిచి.. లాక్కెళ్లి తమ కామవాంఛ తీర్చుకున్నాయి. అర్ధరాత్రి ఆ అభాగ్యురాలి రోదన.. అరణ్య రోదనే అయింది. సాయం కోరుతూ భర్త తోటి ప్రయాణికులను వేడుకున్నా ఏఒక్కరూ కరుణించలేదు. రక్షణ కోసం రైల్వే పోలీసులను ఆశ్రయించినా.. మొద్దునిద్ర వీడలేదు. ఓ నిండు గర్భిణి అత్యాచారానికి గురైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఎట్టకేలకు న్యాయస్థానం.. దోషులకు 20 ఏళ్ల శిక్ష విధించింది. ఈ తీర్పు.. కామంతో కన్నూమిన్నూ గానని మృగాళ్లకు కనువిప్పు కలిగించనుంది.
RAPE CASE: యువతిపై సామూహిక అత్యాచారం కేసులో కోర్టు తీర్పు.. 20 ఏళ్ల పాటు
Prakasam District ప్రకాశం జిల్లాకు చెందిన గర్భిణి భర్తతో కలిసి ఉపాధి కోసం వెళ్తుండగా.. రేపల్లె రైల్వేస్టేషన్లో గతేడాది ఏప్రిల్ 30 అర్ధరాత్రి సామూహిక అత్యాచారం (Gand Rape) జరిగింది. ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు భగ్గుమన్నాయి. ఆందోళనలతో జిల్లా అట్టుడికింది. భర్త వెళ్లి తలుపులు బాది రక్షించాలని కోరినా మొద్దు నిద్రలో ఉన్న జీఆర్పీ స్టేషన్ సిబ్బందిపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. రేపల్లె పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా.. వారు వచ్చేలోగా ఘోరం జరిగిపోయింది.
వాకపల్లి అత్యాచార కేసు.. దర్యాప్తు సక్రమంగా నిర్వహించలేదన్న ప్రత్యేక న్యాయస్థానం
Opposition parties పెల్లుబికిన ఆందోళనలు... గర్భిణిపై లైంగికదాడి ఘటనపై ప్రతిపక్షాలు ఆందోళన చేశాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, ఎమ్మార్పీఎస్, ఇతర దళిత, ప్రజాసంఘాల నేతలు పెద్దఎత్తున ఆందోళన చేయగా... బాధితురాలిని పరామర్శించకుండా నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. మెరుగైన చికిత్స పేరుతో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు యత్నించగా.. దళిత సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. స్థానిక జీజీహెచ్‌కు తరలించాలని కోరుతూ.. అంబులెన్స్‌కు అడ్డుపడిన వారిని పోలీసులు లాగి పడేశారు. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. ఒంగోలు రిమ్స్ ఆసుపత్రి వద్ద కొండెపి టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి, కార్యకర్తలు ఆందోళన చేయగా.. పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. బాధితురాలిని మంత్రులు నాగార్జున, రజిని, ఎస్సీ కమిషన్ సభ్యుడు బసవయ్య పరామర్శించగా.. మరోవైపీ.. బాధిత కుటుంబానికి రూ.పది లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఎమ్మార్పీఎస్ నేతలు డిమాండ్ చేశారు. రైల్వేస్టేషన్లో భద్రతా లోపాలు, రైల్వే పోలీసుల తీరుపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల(Public associations) నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
SP Vakul Jindal 15 నెలల్లో ముగించారు.. గర్భిణిపై లైంగికదాడి కేసు దర్యాప్తు చేపట్టిన ఎస్పీ వకుల్ జిందాల్ నేతృత్వంలోని పోలీసు బృందాలు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నాయి. ఎస్పీ రేపల్లెలో మకాం వేసి దర్యాప్తును స్వయంగా పర్యవేక్షించారు. ఘటన జరిగిన 15 రోజుల్లో విచారణ ముగించి కోర్టులో నిందితులపై అభియోగపత్రాన్ని దాఖలు చేశారు. పోలీసులు సేకరించిన సాక్ష్యాధారాలు, ఫోరెన్సిక్ నిపుణుల నివేదికలు కేసు విచారణలో కీలకంగా నిలిచాయి. 15 నెలల్లో విచారణ ముగిసి ఇద్దరు నిందితులకు శిక్షపడగా.. మరో నిందితుడు జువనైల్ హోమ్‌లో ఉన్నాడు. ఆధారాల సేకరణ మొదలుకుని.. కోర్టు విచారణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని.. నిందితులకు శిక్ష పడేలా పోలీసుశాఖ చేసిన కృషి ఫలించిందని ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు.