Illegal Sand Mining: బాపట్ల జిల్లా కొల్లూరు మండలం.. గాజుల్లంక, జువ్వలపాలెం పరిధిలోని కృష్ణానదిలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. మండలంలో ఎక్కడ పడితే అక్కడ కృష్ణానదిలో ఇసుకను తవ్వేసి, అమ్మకాలు సాగిస్తున్నారు. అధికారులు పర్యవేక్షణ పక్కనపెట్టేశారు. అక్రమార్కులు భారీ యంత్రాలను వినియోగించి ఇసుక తవ్వి.. ట్రాక్టర్లు, లారీల ద్వారా జిల్లా సరిహద్దులు దాటించి అమ్ముకుంటున్నారు. జువ్వలపాలెం సమీపంలోని కృష్ణానది ఒడ్డున, బాపట్లలో ఇసుకను నిల్వ చేస్తున్నారు. వర్షాకాలంలో ముందుగానే నిల్వ చేసుకుని.. ఆ తర్వాత సొమ్ము చేసుకోవాలనేది ఆలోచన.
Sand Smuggling at Swarnamukhi River: అక్రమ ఇసుక రవాణా.. అడ్డుకున్న గ్రామస్థులు
గాజుల్లంక పరిధిలో తవ్వకాలకు అనుమతి 3 నెలల క్రితమే ముగిసింది. కానీ అనుమతి లేని ప్రాంతాల్లో తవ్వకాలు చేస్తున్నా.. అధికారులు అడ్డుకోవడం లేదు. జువ్వపాలెం పరిధిలోని కృష్ణానదిలో 2 కిలో మీటర్ల రహదారిని అక్రమంగా ఏర్పాటు చేశారు. స్థానిక తహసీల్దార్ శ్రీనివాసరావు రహదారి పనులు నిలిపివేయాలని ఆదేశించారు. అయినా కొనసాగించటంతో రహదారికి గండి కొట్టించారు. ఆ తర్వాత పైనుంచి తీవ్ర ఒత్తిళ్లు రాగా.. ఆయన మౌనం దాల్చారు. తహసీల్దార్ కొట్టించిన గండ్లను పూడ్చేసి అదే రహదారిపై నుంచి ఇసుకను వాహనాల ద్వారా తరలిస్తున్నారు. నదిలో రహదారిని నిర్మించేందుకు నదీ ప్రవాహాన్ని మళ్లించారు.
Illegal Sand Mining: నిబంధనలు బేఖాతరు.. వైఎస్సార్సీపీ నేతల కనుసన్నల్లో ఇసుక తవ్వకాలు
ఈ నీరు దిగువకు పోయేందుకు 4 చోట్ల తూములు ఏర్పాటు చేశారు. ఇది నదీ పరిరక్షణ, వాల్టా, పర్యావరణ చట్టాలకు విరుద్ధం. మీటరు లోతుకు మించి లోతు తవ్వి నదిలో ఇసుకను వెలికి తీయడాన్ని నిబంధనలు అనుమతించవు. ఈ నిబంధనలకు నీళ్లొదిలేశారు. జువ్వలపాలెం నుంచి నిత్యం 32 లక్షల రూపాయల విలువైన ఇసుక తరలిపోతోంది. గాజుల్లంక సమీపంలోని నదిలో రోజూ 15లక్షల మేర విలువైన ఇసుక తవ్వుతున్నారు. ప్రత్యక్షంగా ఇసుక తవ్వకాలను పర్యవేక్షించాల్సిన రెవెన్యూ, పోలీసు శాఖలు ఇక్కడ పనిచేయటం లేదు. అక్రమ తవ్వకాల వల్ల సాగు, తాగు నీటికి తీవ్ర కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే కృష్ణానది లంక గ్రామాల ప్రజలు తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నారు.
Sand Mafia In Guntakallu: గుంతకల్లులో ఇసుక ఇక్కట్లు.. భవన నిర్మాణ కార్మికులకు ఇబ్బందులు
"ఈ ప్రాంతంలో ఇష్టారీతిగా ఇసుకను తవ్వేస్తున్నారు. అక్రమార్కులు భారీ యంత్రాలను వినియోగించి ఇసుక తవ్వి.. ట్రాక్టర్లు, లారీల ద్వారా జిల్లా సరిహద్దులు దాటించి అమ్ముకుంటున్నారు. ఇసుక తవ్వకాల వల్ల భూ గర్భ జలాలు ఉప్పు నీరైపోతున్నాయి. ఈ ఉప్పు నీరంతా పైకి వచ్చేస్తోంది. ఈ నీటితో పంటలు పండే పరిస్థితి కూడా లేదు. అక్రమ తవ్వకాల వల్ల భవిష్యత్తులో సాగు, తాగు నీటికి తీవ్ర కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఈ అక్రమ ఇసుక తవ్వకాలపై ఎంతమంది అధికారులకు చెప్పినా ప్రయోజనం లేదు." - స్థానికులు