ETV Bharat / state

Councellors disputes: చీరాలలో వైకాపా కౌన్సిలర్ల తోపులాట.. ఇద్దరు సభ్యుల సస్పెన్షన్‌ - చీరాలలో వైకాపా కౌన్సిలర్ల తోపులాట

Councellors disputes: బాపట్ల జిల్లా చీరాల పురపాలక సంఘ సాధారణ సమావేశం శనివారం రసాభాసగా సాగింది. సమావేశం ప్రారంభమయ్యే ముందు జీరో అవర్‌లో వైకాపాలో ఇరువర్గాల (మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌, ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి) కౌన్సిలర్లు బాహాబాహీకి దిగటంతో.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నంద్యాల జిల్లాలో సైతం పురపాలక కౌన్సిల్‌ సమావేశంలో వాగ్వాదం జరిగింది.

Councellors disputes at chirala and nandyal district
చీరాలలో వైకాపా కౌన్సిలర్ల తోపులాట
author img

By

Published : May 1, 2022, 7:34 AM IST

Councellors disputes: బాపట్ల జిల్లా చీరాల పురపాలక సంఘ సాధారణ సమావేశం శనివారం రసాభాసగా సాగింది. సమావేశం ప్రారంభమయ్యే ముందు జీరో అవర్‌లో వైకాపాలో ఇరువర్గాల (మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌, ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి) కౌన్సిలర్లు బాహాబాహీకి దిగారు. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఒకటో పట్టణ సీఐ మల్లికార్జునరావు సిబ్బందితో చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఛైర్మన్‌, సభ పట్ల అమర్యాదగా ప్రవర్తించారని కౌన్సిలర్లు పాపిశెట్టి సురేష్‌, సల్లూరి సత్యానందంలను మూడు నెలలు సస్పెండ్‌ చేసినట్లు ఛైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు ప్రకటించి, వారిని బయటకు పంపారు.

Councellors disputes at chirala and nandyal district
చీరాలలో నెట్టుకుంటున్న వైకాపాలోని ఇరు వర్గాల కౌన్సిలర్లు

జీరో అవర్‌లోనే రగడ: శనివారం ఉదయం 11.30కి సమావేశం ప్రారంభమవ్వగా జీరో అవర్‌ పెట్టాలని కౌన్సిలర్లు సల్లూరి సత్యానందం, గుంటూరు ప్రభాకర్‌రావు కోరారు. ఛైర్మన్‌ అనుమతితో మొదటగా సత్యానందం (ఆమంచి వర్గం) మాట్లాడారు. అంబేడ్కర్‌ జయంతిరోజు విగ్రహానికి రంగులు వేయలేదని.. అధికారులు సమాధానం చెప్పాలన్నారు. నియోజకవర్గంలో సుమారు 40-50 వేల మంది దళితులు ఉన్నారంటూ ప్రస్తావించారు. దీనిపై కరణం వర్గానికి చెందిన కౌన్సిలర్లు మండిపడ్డారు. అంబేడ్కర్‌ అందరివాడని.. కొంతమందికే అన్నట్లు మాట్లాడటం సరికాదన్నారు. ఈ విషయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

అనంతరం సత్యానందం, అంబేడ్కర్‌ అందరివాడనడంతో సమావేశం తిరిగి ప్రారంభమైంది. తదుపరి జీరో అవర్‌లో పాపిశెట్టి సురేష్‌బాబు(ఆమంచి వర్గం) మాట్లాడారు. పలు సమస్యలను ప్రస్తావించి, వచ్చే సమావేశంలో అధికారులతో వివరణ ఇప్పించాలని.. లేనిపక్షంలో మన ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందన్నట్లుగా సురేష్‌ మాట్లాడటంతో మళ్లీ రగడ మొదలైంది. కరణం వర్గానికి చెందిన పలువురు కౌన్సిలర్లు మన ప్రభుత్వం కాదని.. ఇది మా ప్రభుత్వమని వాగ్వాదానికి దిగారు. అనంతరం సురేష్‌, సత్యానందం ఛైర్మన్‌ పోడియం వద్దకు వచ్చి ఛైర్మన్‌తో మీరంతా గతంలో తెదేపానే కదా అన్నారు. దీంతో ఇరువర్గాల వారు బాహాబాహీకి దిగారు.

అనంతరం బలరాం వర్గం కౌన్సిలర్లు పోడియం వద్ద బైఠాయించి.. సత్యానందం, సురేష్‌ను సస్పెండ్‌ చేయాలని డిమాండు చేశారు. తదుపరి ఛైర్మన్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ... సత్యానందం, సురేష్‌ పోడియం వద్దకు వచ్చి, సభా సంప్రదాయాలు పాటించకుండా మాట్లాడారని, ఇందుకు మూడు నెలలు సస్పెండ్‌ చేసినట్లు చెప్పారు. వారిద్దరితో పాటు అదే వర్గంలోని మరికొందరు కౌన్సిలర్లు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.

నంద్యాలలోనూ వైస్‌ ఛైర్మన్‌, కౌన్సిలర్‌ వాగ్వాదం.. నంద్యాల ప్రధాన రహదారిలో ఆక్రమణల విషయమై శనివారం నిర్వహించిన పురపాలక కౌన్సిల్‌ సమావేశంలో వాగ్వాదం జరిగింది. వైస్‌ ఛైర్మన్‌ పాంషావలి, కౌన్సిలర్‌ కృష్ణమోహన్‌ మధ్య మాటామాటా పెరిగి సమావేశం రసాభాసగా మారింది. ఆర్‌ఎఫ్‌ రోడ్డులో ఆక్రమణలు పెరిగిపోతున్నా, అధికారులు పట్టించుకోవడంలేదని అధికార పార్టీ కౌన్సిలర్‌ కృష్ణమోహన్‌ ప్రస్తావించారు. ఆయనకు వైకాపాకు చెందిన వైస్‌ ఛైర్మన్‌ పాంషావలి అడ్డుతగిలారు.

నంద్యాలలో వాదించుకుంటున్న కౌన్సిలర్ కృష్ణమోహన్, వైస్ ఛైర్మన్ పాంషావలి

తాను మాట్లాడుతుంటే ఎందుకు అడ్డుతగులుతున్నావని కృష్ణమోహన్‌ పాంషావలిని ప్రశ్నించారు. తన వార్డు అంశాన్ని మీరెందుకు లేవనెత్తారని పాంషావలి ప్రశ్నించారు. ఆ వార్డు తన పరిధిలో కూడా ఉందని కృష్ణమోహన్‌ చెప్పడంతో.. ఆయన మాటలకు అడ్డుచెబుతూ పాంషావలి ముందుకొచ్చారు. కృష్ణమోహన్‌ కూడా ఆవేశంగా వైస్‌ఛైర్మన్‌ వైపు చొచ్చుకెళ్లారు. అనంతరం పాంషావలి మాట్లాడుతూ తన వార్డులోనే కాదని, పట్టణమంతా ఆక్రమణలు ఉన్నాయన్నారు. అక్కడి వారికి ప్రత్యామ్నాయం చూపితే తానే దగ్గరుండి వారిని ఖాళీ చేయిస్తానని చెప్పారు.

తాను పేదల గురించి మాట్లాడటం లేదని.. ఆసుపత్రులు, బ్యాంకులు ఉన్న భవనాలూ పది అడుగుల మేర రోడ్డుపైకి చొచ్చుకొచ్చాయని కృష్ణమోహన్‌ బదులిచ్చారు. తాను పేదల కోసమే మాట్లాడానని, వాణిజ్య భవనాల గురించి కాదని వైస్‌ ఛైర్‌పర్సన్‌ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.

ఇదీ చదవండి:

గందరగోళంగా ఆర్‌సెట్‌ కౌన్సెలింగ్‌... ఆశావహుల ఆవేదన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.