..
ఇండియన్ కార్ రేసింగ్‌లో తప్పిన ప్రమాదం.. డ్రైవర్ అప్రమత్తతతో - కార్ రేసింగ్ డ్రైవర్లు
Car Racing Accident: హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ ప్రాంతంలో ఇండియన్ కార్ రేసింగ్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ పోటీలను నగరవాసులు ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం రేసింగ్‌లో పెను ప్రమాదం తప్పింది. ప్రసాద్ ఐ మ్యాక్స్ ఎదుట ట్రాక్ మీదుగా అతివేగంతో దూసుకెళ్తున్న ఓ కారుపై ఒక్కసారిగా చెట్టు కొమ్మ విరిగి పడటంతో కారు అదుపుతప్పింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి కొద్ది దూరంలో ట్రాక్ పక్కన కారును నిలిపివేశాడు. ప్రమాదంలో డ్రైవర్ క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కార్ రేసింగ్
..