Farmers Worried About Tomato Prices : ఆరుగాలం కష్టించి పండించిన టమోటాకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతుల బాధ అంతా ఇంతా కాదు. టమోటా కోత కోసి మార్కెట్కు తరలించిన ఖర్చులు కూడా రాకపోగా, ఇంటికి తిరిగివెళ్లడానికి చేతి నుంచి ఖర్చులు భరించుకోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత రెండు నెలలుగా మదనపల్లి మార్కెట్ యార్డ్లో నెలకొన్న పరిస్థితి ఇందుకు అద్దం పడుతుంది.
అన్నమయ్య జిల్లా మదనపల్లె మార్కెట్ యార్డ్లో టమోటా సీజన్ ప్రారంభమైంది. గతంలో కంటే ఇప్పుడు దిగుబడులు అనుహ్యంగా పెరిగాయి. రెండు రోజుల క్రితం 500 టన్నులు వస్తుండగా ప్రస్తుతం 800 వరకు టమోట వస్తోంది. దీనికి తోడు కొనుగోలుదారులు గిట్టుబాటు ధర లేక సరుకు కొనడానికి ఎవ్వరూ ముందుకు రావట్లేదు. ప్రస్తుతం మదనపల్లి మార్కెట్ నుంచి తెలంగాణ, చత్తీస్‍ఘడ్ రాష్ట్రాలకు మాత్రమే ఎగుమతి జరుగుతుంది. డిమాండ్ కన్నా ఎక్కువ దిగుబడి వస్తుండడంతో రైతుకు గిట్టుబాటు ధర లభించడం లేదని అంటున్నారు. అయితే రైతులు మాత్రం తాము ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి పండించుకున్న పంటను కోనేవారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాక్స్ 30 నుంచి 40 రూపాయలు ధర మాత్రమే పలుకుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కష్టాల నుంచి గట్టెక్కించాలని రైతులు వేడుకోలు : టమోటా పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ మదనపల్లె మార్కెట్ యార్డు ఎదుట టీడీపీ, సీపీఐ నాయకులు ధర్నా చేశారు. యార్డ్ ప్రధాన గేటు వద్ద టమోటాలు పారబోసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోని టమోటా రైతులను ఆదుకోవాలని, తమను కష్టాల నుంచి గట్టెక్కించాలని రైతులు వేడుకుంటున్నారు.
టమోటా దిగుబడి పెరిగింది..నాణ్యత లోపించింది : అయితే మార్కెట్ అధికారులు మాత్రం రెండు రోజులుగా మార్కెట్కు అనూహ్యమైన దిగబడి వస్తుందని, గత సంవత్సరంతో పోలిస్తే మూడింతలు పెరిగిందని అంటున్నారు. నాణ్యత లేకపోవడంతో ధర తగ్గిపోయిందని, క్వాలిటీ లేని టమోటాను మాత్రమే కొనలేదని మదనపల్లి మార్కెట్ యార్డ్ సెక్రటరీ అభిలాష్ అన్నారు.
"మార్కెట్ యార్డ్లో టమోటాలకు గిట్టుబాటు ధర రావటం లేదు. బాక్స్ 30 నుంచి 40 రూపాయలు అమ్ముతున్నారు. యార్ట్కు తరలించాలన్న మాకు అధనంగా మా చేతి నుంచి పడుతుంది. టమోటాను కూడా కొనడం లేదు."- టమోటా రైతులు
"టమోటా క్యాలిటి లేనందున ధర తగ్గిపోయింది. మూడు రోజుల దాకా 500 టన్నుల టమోటా వచ్చింది. ప్రస్తుతం 800 టన్నుల టమోట వస్తోంది. సరకు నాణ్యత కూడా బాగా లోపించింది. దీని కారణంగా సరకు నిలబడిపోయింది. వ్యాపారస్థులతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరిస్తాం."- అభిలాష్, మదనపల్లి మార్కెట్ యార్డ్ సెక్రటరీ
ఇవీ చదవండి