ETV Bharat / state

నాగోల్‌ 'బంగారం చోరీ' కేసు.. అదే దొంగల్ని పట్టించింది

Nagole Gold Theft Case : తెలంగాణలోని హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన నాగోల్ కాల్పుల కేసులో దోపిడీ ముఠాను తెల్లచొక్కా పట్టించింది. రూ.కోటీ 30 లక్షల విలువైన బంగారాన్ని కొట్టేసిన నిందితుల్లో ఒకరు తెల్లచొక్కా ధరించి ద్విచక్రవాహనంపై వచ్చాడు. అంతకుముందు అదే చొక్కాతో ట్రాఫిక్ పోలీసుల కెమెరాకు చిక్కాడు. రెంటినీ పోల్చుకుని రివర్స్ ఇంజినీరింగ్ విధానంలో దర్యాప్తు జరిపిన పోలీసులకు నిందితుల ఆచూకీ లభ్యమైంది. ఆధారాలతో కూపీ లాగిన పోలీసులు దోపిడికి పాల్పడిన, సహకరించిన వ్యక్తులను గుర్తించారు. ఈ వ్యవహారంలో మొత్తం 10 మందిపై కేసులు నమోదు చేసి.. ఆరుగురుని అరెస్టు చేశారు. ప్రధాన సూత్రధారులు నలుగురు పరారీలో ఉన్నారు.

నాగోల్‌ 'బంగారం చోరీ' కేసు.. అదే దొంగల్ని పట్టించింది
నాగోల్‌ 'బంగారం చోరీ' కేసు.. అదే దొంగల్ని పట్టించింది
author img

By

Published : Dec 8, 2022, 12:26 PM IST

నాగోల్‌ 'బంగారం చోరీ' కేసు.. అదే దొంగల్ని పట్టించింది

Nagole Gold Theft Case : నగల దుకాణంలో తుపాకీతో ఇద్దరిపై కాల్పులు జరిపి.. రూ.కోటీ ముప్పై లక్షల రూపాయల విలువైన బంగారం దోచుకుపోయిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి దోపిడీ చేసిన 2 కిలోల 700 గ్రాముల బంగారం, మూడు దేశవాళి పిస్టళ్లు, 25 రౌండ్ల బుల్లెట్లు, కత్తి, నాలుగు ద్విచక్రవాహనాలు, కారు, ఆరు చరవాణులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దోపిడీ ముఠాలో ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు పరారీలో ఉన్న మరో నలుగురి కోసం గాలిస్తున్నారు.

పక్కా ప్రణాళిక ప్రకారమే దొంగల ముఠా దోపిడీ చేయడంతోపాటు కాల్పులకు తెగబడింది. రాజస్థాన్‌కు చెందిన మహేంద్ర కుమార్ చౌదరి గజ్వేల్‌లో ఆభరణాల దుకాణం నిర్వహిస్తున్నాడు. భారీగా డబ్బు సంపాదించాలనే ఆశతో బంగారం దోపిడీకి పథకం వేశాడు. బంగారం వ్యాపారి రాజ్‌కుమార్ సురానాను లక్ష్యంగా చేసుకున్నారు. అందుకోసం గతంలో రాజకుమార్ దుకాణంలో పనిచేసిన రామాయంపేటకు చెందిన బన్నీ రామ్ సహకారం తీసుకున్నాడు. గజ్వేల్‌కు చెందిన కాంట్రాక్టర్ మహ్మద్ ఫిరోజ్ రాజస్థాన్, హర్యానాకు చెందిన దోపిడీ దొంగలు సుమిత్ దగర్, మనీశ్, మన్యా సహా మొత్తం ఎనిమిది మంది సాయం తీసుకున్నాడు.

ప్లాన్​ వేసి.. రెక్కీ చేసి..: పక్కా ప్రణాళిక ప్రకారం బన్సీరామ్.... బంగారం వ్యాపారి రాజ్‌కుమార్ ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో రెక్కీ చేశాడు. దోపిడీ చేసి పారిపోయేందుకు అక్టోబరు 29న గజ్వేల్‌లో ఫిరోజ్ పేరిట పల్సర్‌ బైక్‌ కొన్నారు. నవంబరు ఒకటిన స్కూటీపై మన్యా, బన్సీరామ్ ఇద్దరూ పాట్‌ మార్కెట్‌కు చేరుకుని వ్యాపారి రాజకుమార్ కదలికలపై నిఘా పెట్టారు. మధ్యాహ్నం 2 గంటలకు 3 కిలోల బంగారు ఆభరణాలతో వ్యాపారి రాజ్‌కుమార్‌, సహాయకుడు సుఖరామ్‌తో కలిసి బయలుదేరారు. వీరి వెంటే నలుగురు నిందితులు బోడుప్పల్​, పీర్జాదిగూడ, సుష్మా, వనస్థలిపురం మీదుగా రాత్రి 8 గంటలపుడు నాగోల్‌ స్నేహపురి కాలనీలోని దుకాణం వద్దకు చేరుకున్నారు. ఒక్కసారిగా సుమిత్ దగర్, మనీష్ దుకాణంలోకి చొరబడ్డారు. మన్యా బయట నుంచి షెటర్ మూసివేశాడు. బంగారం ఇవ్వాలని సుమిత్ తుపాకీతో బెదిరించగా.. రాజ్‌కుమార్‌ నిరాకరించడంతో కాల్పులు జరిపాడు. కళ్యాణ్ చౌదరి, సుఖ్‌రామ్‌ గాయపడగా... నిందితులు బంగారంతో వాహనంపై పరారయ్యారు.

నిందితులను పట్టించిన తెల్ల చొక్కా..: ఫిర్యాదుదారు ఇచ్చిన వివరాల ఆధారంగా సికింద్రాబాద్ నుంచి స్నేహపురికాలనీ వరకూ కెమెరాలను పరిశీలించారు. రామాయంపేట దగ్గర తెల్లచొక్కాతో బన్సీరామ్ ట్రాఫిక్ కెమెరాకు చిక్కాడు. ఆ వివరాల ఆధారంగా బన్సీరామ్‌ను అదుపులోకి తీసుకోగా... మొత్తం గుట్టు బయటపడింది. నలుగురు ప్రధాన నిందితులు మహేంద్ర, సుమిత్, మనీశ్, మన్యా కోసం 15బృందాలతో గాలిస్తున్నారు. ఈ కేసులో పోలీసులు రివర్స్‌ ఇంజినీరింగ్‌ పద్దతిలో చేసిన విచారణ ఫలించి..సులభంగా చేధించగలిగారు.

ఇవీ చూడండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.