అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైకాపా రాష్ట్ర కార్యదర్శి రమేష్ రెడ్డి ప్రైవేటు ఆస్పత్రుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ.. కాంచాని ఆసుపత్రి ఎదుట ధర్నా చేపట్టారు. గత నాలుగు రోజులుగా తాడిపత్రి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రైవేటు వైద్యులకు, వైకాపా రాష్ట్ర కార్యదర్శి రమేష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సాధారణ రోగులు ఆస్పత్రుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ఈనెల 21వ తేదీన రమేష్ రెడ్డి ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయని.. కరోనా వైరస్ లక్షణాలు ఇలాగే ఉండడంతో సాధారణ రోగులను కరోనా పరీక్షలు చేయించుకోమంటున్నారని రమేష్ రెడ్డి అన్నారు. దీంతో ప్రజలు భయపడుతున్నారని అన్నారు. ప్రైవేటు ఆసుపత్రులు ..సాధారణ రోగులకు చికిత్స చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీచదవండి: 'డాక్టర్ పట్టించుకోవట్లేదు..ఆక్సిజన్ పెట్టట్లేదు..ఊపిరి తీసుకోవటం కష్టంగా ఉంది'