అనంతపురం కలెక్టరేట్ ఎదుట ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించి.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. తన తల్లి పొదుపు డబ్బులను అధికారులు స్వాహా చేశారని ఆరోపిస్తూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. బాధితుడు నార్పల మండలం గూగూరు వాసి రామకృష్ణారెడ్డిగా గుర్తించారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
ఇదీ చదవండి: విశాఖలో కొండచరియ విరిగిపడి తల్లీబిడ్డ మృతి