''నేను వైసీపీ నాయకురాలు.. నాకు రెండు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి'' అంటూ హజరాబి అనే మహిళా అనంతపురంలోని రాజీవ్ కాలనీ సచివాలయం వద్ద హల్చల్ చేశారు. బంధువులతో కలిసి మహిళా వాలంటీర్ అనురాధపై దాడికి పాల్పడింది. ఈ మేరకు స్థానిక 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో సచివాలయ సిబ్బందితో కలిసి బాధితురాలు ఫిర్యాదు చేశారు.
'ఆదివారం స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి పట్టాలు పంపిణీ చేశారు. ఆ సమయంలో తనకు వచ్చిన పట్టా తీసుకోకుండా రెండు పట్టాలు కావాలంటూ వైకాపా నాయకురాలు హజరాబి బెదిరించింది. పంపిణీలో భాగంగా నాకు వచ్చిన పట్టాను నేను తీసుకున్నా. అయితే ఆమె ఇంటి స్థలం పట్టా తాను తీసుకున్నానన్న నెపంతో కోపం పెంచుకున్న హజరాబి..దాడి చేసింది' అని వాలంటీర్ అనురాధ పేర్కొన్నారు.
హజరాబి తన బంధువులతో ఇంటిపైకి వచ్చి దాడి చేసిందని బాధితురాలు వాపోయింది. సచివాలయ సిబ్బందిని ఆమె నిత్యం బెదిరిస్తూ.. వేధింపులకు గురి చేస్తోందని ఆరోపించారు. పోలీసులు తనకు న్యాయం చేయాలని కోరారు.
ఇదీ చూడండి: