అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో గత కొద్దిరోజులుగా నెలకొన్న తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఉరవకొండ నియోజకవర్గ ఇంచార్జీ, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం నుంచి కనేకల్ క్రాస్ వరకు రూ.30 లక్షలతో నిర్మించబోయే నూతన పైప్‌లైన్ పనులకు ఆయన భూమిపూజ చేశారు.
అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇబ్బందులు మీకు పట్టవా అని ప్రశ్నించారు. నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న స్థానిక డీఈ రామయ్యపై చర్యలు కోసం కలెక్టర్‌ను కలుస్తానని చెప్పారు.
ఇదీ చూడండి