ETV Bharat / state

YSRCP leader suspended: బహిరంగ విమర్శలు.. వైసీపీ లీడర్​ సస్పెన్షన్​​.. మరో నేతకు షోకాజ్​ నోటీసు - వై మధుసూదన్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్

YSRCP Strict Action Against To Leaders: వైసీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శిపై పార్టీ సస్పెన్షన్​ వేటు విధించింది. అంతేకాకుండా అదే జిల్లాకు చెందిన మరో నేతకు షోకాజు నోటీసులు జారీ చేసింది. పార్టీ ఆగ్రహనికి గురైన ఇరువురు నేతలు సొంత పార్టీ నాయకుల పైనే విమర్శలు చేశారు. వారి విమర్శలు హద్దులు దాటి ఉన్నాయని.. అందుకే పార్టీ ఈ చర్యకు ఉపక్రమించిందని ఆ పార్టీ నేతలు వివరించారు.

YSRCP
వైఎస్సార్​ కాంగ్రెస్ పార్టీ
author img

By

Published : Jul 5, 2023, 10:27 PM IST

YSRCP Strict Action Against To Two Leaders in Anantapur: అధికార వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ ఇద్దరు కీలక నేతలపై సీరియస్​ అయ్యింది. అంతేకాకుండా వారిలో ఒకరిని పార్టీ నుంచి సస్పెండ్​ చేసింది. మరోకరికి షోకాజ్​ నోటీసులు జారీ చేసి హెచ్చరించింది. పార్టీ వీరిపై ఇలాంటి చర్యలు తీసుకోవటానికి బలమైన కారణాలే ఉన్నాయి. సొంత పార్టీ నాయకుల పైనే భూ అక్రమాల ఆరోపణలు చేసినందుకు ఒకర్ని సస్పెండ్​ చేయగా.. అవమానించారంటూ చేసిన వ్యాఖ్యలకు ఓ నాయకుడికి షోకాజ్​ నోటీసులు అందించింది.

వైసీపీ మాజీ రాష్ట్ర కార్యదర్శి సస్పెండ్​: అనంతపురం జిల్లా వైఎస్సార్​ కాంగ్రెస్ పార్టీలోని ఇద్దరు కీలక నేతలపై అధిష్టానం మండిపడింది. ఉరవకొండ రాజకీయాల్లో కీలకంగా ఉన్న వైసీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి వై. మధుసూదన్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్​ చేసింది. ఉరవకొండ నియోజకవర్గంలో భూ అక్రమాలలో వైసీపీ నాయకులు ఉన్నారంటూ ఆయన గతంలో వ్యాఖ్యానించారు. పరోక్షంగా ఆయన మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, ఆయన కుమారుడు ప్రణయ్​ రెడ్డిలపైనే ఈ వ్యాఖ్యలు చేశారని సమాచారం. దీనిని పరిగణనలోకి తీసుకున్న పార్టీ హైకమాండ్​ అయనపై ఈ చర్యలు తీసుకున్నట్లు.. వైసీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య తెలిపారు.

అనంతపురం కీలక నేతకు షోకాజ్​: శింగనమల నియోజకవర్గంలో ఏప్రిల్​ నెలలో ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి పర్యటించిన విషయం విదితమే. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, సాంబశివారెడ్డిలు.. తనను అవమానించారంటూ శింగనమల నియోజకవర్గానికి చెందిన చామలూరు రాజగోపాల్‌ విమర్శలు చేశారు. దీనిపై విచారించిన వైసీపీ.. పార్టీ లైన్​ దాటి మాట్లాడారని ఆయనకు షోకాజ్​ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో షోకాజ్​ నోటీసులపై వివరణ ఇవ్వాలని ఆయనకు సూచించింది. లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది.

ఎవరైనా సరే చర్యలు తప్పవు: పార్టీ పరువుకు భంగం కలింగించేలా రాజగోపాల్​ మాటలు ఉన్నాయని.. వైసీపీ జిల్లా అధ్యక్షుడు నరసింహయ్య తెలిపారు. పార్టీ లైన్​కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా చర్యలు తప్పవని ఆయన అన్నారు. పార్టీ అధిష్టానం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. అనంతపురం జిల్లాలోని ఇద్దరు నేతలపై వైసీపీ అధిష్టానం ఇలాంటి చర్యలకు ఉపక్రమించటం.. జిల్లా వైసీపీలో చర్చనీయాంశంగా మారింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.