అనంతపురం జిల్లా మడకశిర మండలం కదిరేపల్లి గ్రామ సచివాలయం వద్ద శ్రీరామిరెడ్డి తాగునీటి పథకంలో పనిచేస్తున్న కార్మికులు నిరసన చేపట్టారు. కార్మిక చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వినతిపత్రాన్ని సచివాలయ కార్యదర్శికి అందజేశారు. తమకు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరారు. రూ.18 వేల కనీస వేతనం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్ట్ విధానం రద్దు చేసి రెగ్యులరైజ్ చేయాలని పేర్కొన్నారు. రెండు నెలల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇది చదవండి జనం లేకుండా జగన్నాథుడు.. చరిత్రలో ఇదే ప్రథమం