అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోని కోటంక గ్రామస్తులు.. నీటి విడుదల కోసం రామచంద్రాపురం వెళ్లారు. నీరు వదిలేది లేదని రామచంద్రాపురం రైతులు తెగేసి చెప్పారు. రెండు గ్రామాల ప్రజల మధ్య వాగ్వాదం జరిగింది. కూడేరు మండల పరిధిలోని రామచంద్రాపురం చెరువు నుంచి శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె మండలంలోని.. కోటంక గ్రామంలోని చెరువుకు నీటిని తీసుకుపోవడానికి తాము ఒప్పుకోబోమని రామచంద్రాపురం రైతులు ఇరిగేషన్ అధికారులకు తెగేసి చెప్పారు. నీటిని విడుదల చేసేందుకు వచ్చిన ఇరిగేషన్ అధికారులను అడ్డుకున్నారు. ఈ కారణంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. గ్రామస్తులకు పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.
ఇదీ చదవండి: