ఇళ్ల పట్టాల పేరుతో సీఎం జగన్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం దోచుకోవటం, దాచుకోవటం తప్ప ఒక్క అభివృద్ధి పనీ చేయలేదని విమర్శించారు. అనంతపురంలో విష్ణువర్ధన్ రెడ్డి ఈ విషయమై మీడియా సమావేశంలో మాట్లాడారు.
'అది విద్యాదీవెన కాదు.. విద్యార్థులను మోసం చేసిన పథకం. కేంద్ర పథకాల్లో ప్రధాని నరేంద్ర మోదీ తన పేరు దేనికీ పెట్టుకోలేదు. ఇక్కడ రాష్ట్రాన్ని మొత్తంగా జగన్ మయం చేశారు. గతంలో కట్టించిన ఇళ్లను పంపిణీ చేయలేని ఈ అసమర్థ ప్రభుత్వం.. కొత్తగా 30 లక్షల ఇళ్లు కట్టిస్తామంటూ ప్రజలను మోసం చేస్తోంది' - విష్ణువర్ధన్ రెడ్డి, భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు... ఏడాది కాలంలో దేవాలయ పరిరక్షణకు.. అనేక కార్యక్రమాలు నిర్వహించారని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఆవ భూముల దందాను గుర్తించి బయటపెట్టిందని సోము వీర్రాజేనని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
Smart Townships: జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్‌లో.. కుటుంబానికో ఇంటి స్థలం..!