villagers protested: పాఠశాల ఆవరణలో మృతదేహాన్ని పూడ్చిపెట్టటంపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. అనంతపురం జిల్లా ఎర్రగుంట్లకు చెందిన ఓ వ్యక్తి తన భార్య మృతదేహాన్ని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో పూడ్చి పెట్టారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన గ్రామస్థులు, ఉపాధ్యాయులు పాఠశాలకు తాళం వేసి ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించాలని ఫిర్యాదు చేశారు.
పాఠశాల ఆవరణ తన భూమి అంటూ అందుకు సంబంధించిన రికార్డులు తనకు ఉన్నాయంటూ సెలవు రోజున ఓ వ్యక్తి తన భార్య మేరీ శవాన్ని పాఠశాల ఆవరణంలోనే పూడ్చి పెట్టాడు. దీంతో పాఠశాల విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నారని.. విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. ఇదే విషయమై అప్పట్లో ఆందోళన చేపట్టగా.. రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు గ్రామస్థులు వెల్లడించారు. రెండు నెలలు కావొస్తున్నా అధికారులు స్పందించకపోవటంతో మరోసారి ఆందోళనకు దిగారు. పాఠశాలలను మూసివేసి విద్యార్థులతో పాటుగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు.
ఇవీ చదవండి: