రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండడంతో.. అనంతపురం జిల్లా రాప్తాడు పోలీసులు రాత్రి సమయంలో మరూరు టోల్ గేట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో పోలీసులు ఐచర్ వాహనాన్ని తనిఖీ చేశారు. అందులో రూ. 15 లక్షల విలువచేసే గుట్కా ప్యాకెట్లను గుర్తించారు. వీటిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. గుట్కా ప్యాకెట్లతో పాటు.. వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణాకు సంబంధించి బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడతామని పోలీసులు పేర్కొన్నారు.
గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్ - అక్రమంగా గుట్కా ప్యాకెట్లను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ న్యూస్
వాహనాల తనిఖీ చేపట్టిన అనంతపురం జిల్లా రాప్తాడు పోలీసులు.. అక్రమంగా గుట్కా ప్యాకెట్లను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 15 లక్షల గుట్కా ప్యాకెట్లతో పాటు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.