ETV Bharat / state

కదిరిలో ఈదురుగాలులు: కూలిన చెట్లు, హోర్డింగ్స్​

వాతావరణ మార్పుల కారణంగా అనంతపురం జిల్లా కదిరిలో ఈదురుగాలులు వీచాయి. బలమైన గాలుల ధాటికి చెట్లు హోర్డింగ్స్​ కూలిపోయాయి.

author img

By

Published : Apr 22, 2021, 4:22 PM IST

trees collapsed due to strong wind
ఈదురుగాలుల వల్ల కూలిన చెట్లు

అనంతపురం జిల్లా కదిరిలో ఈదురుగాలుల ధాటికి చెట్లు, హోర్డింగ్స్​ కూలిపోయాయి. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఉన్న ఎస్సీ బాలికల వసతి గృహం వద్ద భారీ వృక్షం విరిగి పడటంతో ప్రహరీ ధ్వంసమైంది. కుటాగుళ్లలో నివాసాల మధ్య చెట్టు కూలి ద్విచక్రవాహనాలపై పడింది. దీంతో బైక్​లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కదిరి ప్రాంతీయ వైద్యశాల ప్రహరీ వద్ద ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్ పడిపోయింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

ఇదీ చదవండి: వర్షాలకు నష్టపోయిన అరటి రైతులకు మంత్రి శంకరనారాయణ భరోసా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.