ETV Bharat / state

తిమ్మమ్మ మర్రిమానును కాపాడుదాం... భావితరాలకు చూపిద్దాం!

author img

By

Published : Dec 16, 2019, 10:06 PM IST

ప్రపంచ ప్రసిద్ధి చెంది, గిన్నిస్ బుక్ లో స్థానం పొందిన తిమ్మమ్మ మర్రిమాను సంరక్షణ కొరవడుతోంది. అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో మహావృక్షం కొమ్మలు ఒక్కటొక్కటిగా ఎండిపోతున్నాయి. తిమ్మమాంబ ఆలయ ఆదాయం, గ్రామస్తులు ఇచ్చిన భూములపై చూపుతున్న శ్రద్ధ, చారిత్రక వారసత్వం కలిగిన తిమ్మమ్మ మర్రిమాను పై చూడడం లేదంటూ స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

timmamma marrimanu tree in ananthapuram district
'తిమ్మమ్మ మర్రిమానును కాపాడుదాం... భావితరాలకు చూపిద్దాం'

'తిమ్మమ్మ మర్రిమానును కాపాడుదాం... భావితరాలకు చూపిద్దాం'

అనంతపురం జిల్లా నంబులపూలకుంట మండలం గూటి బయలు వద్ద సుమారు 6 ఎకరాలలో విస్తరించి ఉన్న తిమ్మమ్మ మర్రిమాను... ఇటీవల కాలంలో సంరక్షణ కొరవడి ఎండిపోతోంది. 6వందల ఏళ్లకు పైగా వయసు కలిగి... వారసత్వ సంపదగా భావిస్తున్న ఈ మహావృక్షం ఎండిపోవటం... తిమ్మమాంబ వంశస్థులతో పాటు స్థానికులను కలవరపెడుతోంది.

సేవ్ తిమ్మమ్మ మర్రిమాను...

తిమ్మమ్మ మర్రిమాను బాధ్యతను అటవీశాఖకు అప్పగించే వరకు... దిన దిన ప్రవర్ధమానం చెందిందని, అధికారులు సకాలంలో స్పందించని కారణంగా మర్రిమాను దెబ్బతింటోందని తిమ్మమాంబ వంశీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంరక్షణ చర్యలు చేపట్టాలంటూ స్థానిక యువత 'సేవ్ తిమ్మమ్మ మర్రిమాను' అంటూ నిరసన ప్రదర్శన చేపడుతోంది.

బాధ్యత అందరిది...

తిమ్మమ్మ మర్రిమాను సంరక్షణపై స్థానికుల ఆందోళన, అటవీశాఖ అధికారులు వ్యవహార తీరును తెలుసుకునేందుకు స్థానికులతో... జిల్లా అటవీ శాఖ అధికారి సమావేశమయ్యారు. సంరక్షణ చర్యలతో పాటు... ఆలయ అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన మర్రిమాను సంరక్షణ... అటవీశాఖ అధికారులతో పాటు... స్థానికులకూ ఉందని అటవీ శాఖ జిల్లా అధికారి జగన్నాథ్ సింగ్ సూచించారు. భవిష్యత్ తరాలకు సైతం ఈ మహావృక్షాన్ని వారసత్వ సంపదగా అందించేందుకు అటు ప్రభుత్వం...ఇటు ప్రజలు కృషి చేయాలని స్థానికులు కోరారు.

ఇవీ చూడండి

ఒకేచోట 110 దేశాల అరుదైన కరెన్సీ

Intro:రిపోర్టర్ : కె. శ్రీనివాసులు
సెంటర్   :  కదిరి
జిల్లా      : అనంతపురం
మొబైల్ నం     7032975449
Ap_Atp_46_05_Action_Plan_For_Thimmamma_Marrimanu_PKG_AP10004

Body:ప్రపంచ ప్రసిద్ధి చెంది, గిన్నిస్ బుక్ లో స్థానం పొందిన తిమ్మమ్మ మర్రిమాను సంరక్షణ కొరవడుతోంది. అటవీ శాఖ అధికారులు నిర్లక్ష్యం తో మహావృక్షం కొమ్మలు ఒక్కటొక్కటిగా ఎండిపోతున్నాయి. తిమ్మమాంబ ఆలయ ఆదాయం, గ్రామస్తులు ఇచ్చిన భూములపై చూపుతున్న శ్రద్ధ, చారిత్రక వారసత్వం కలిగిన తిమ్మమ్మ మర్రిమాను పై చూడడం లేదంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిమ్మమ్మ మర్రిమాను సంరక్షణపై స్థానికులు ఆందోళన, అటవీశాఖ అధికారులు వ్యవహార తీరు తెలుసుకునేందుకు జిల్లా అటవీ శాఖ అధికారి తిమ్మమ్మ మర్రిమాను స్థానికులతో సమావేశమయ్యారు.
వందల సంవత్సరాలు చరిత్ర కలిగిన తిమ్మమ్మ మర్రిమాను సంరక్షణ స్థానికులతో పాటు అటవీశాఖ అధికారుల పైన ఉందని అటవీ శాఖ జిల్లా అధికారి జగన్నాథ్ సింగ్ అన్నారు
అనంతపురం జిల్లా నంబులపూలకుంట మండలం గూటి బయలు వద్ద ఆరెకరాల లో విస్తరించి ఉన్న తిమ్మమ్మ మర్రిమాను ఇటీవల కాలంలో సంరక్షణ కొరవడి ఎండిపోతోంది. వారసత్వ సంపదగా భావించి తిమ్మమ్మ మర్రిమాను ఎండిపోవడం తిమ్మమాంబ వంశస్థుల తో పాటు స్థానికులను కలవరపెడుతోంది. అటవీశాఖకు అప్పగించే వరకు తిమ్మమ్మ మర్రిమాను దిన దిన ప్రవర్ధమానం చెందిందని, అధికారులు సకాలంలో స్పందించని కారణంగా మర్రిమాను దెబ్బతింటోందని తిమ్మమాంబ వంశీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిమ్మమ్మ మర్రిమాను కాపాడాలంటూ స్థానిక యువత తిమ్మం సేవ్ తిమ్మమ్మ మర్రిమాను అంటూ రెండు నెలలకు నిరసన ప్రదర్శనలు చెబుతున్నారు. తిమ్మమ్మ మర్రిమాను వద్ద ఏర్పాటుచేసిన సమావేశానికి సేవ్ తిమ్మమ్మ మర్రిమాను బృందాన్ని అధికారులు ఆహ్వానించారు . తిమ్మమ్మ మర్రిమాను వద్ద అటవీశాఖ అధికారుల అత్యుత్సాహం తో తీసుకుంటున్న నిర్ణయాల వల్ల స్థానికులకు ఎదురవుతున్న ఇబ్బందులు పైన చర్చించారు. మహావృక్షం సంరక్షణకు చేపట్టాల్సిన సర్వేలను ప్రాధాన్య క్రమంలో ఎంపిక చేసుకున్నారు. ప్రభుత్వము ప్రజల సహకారంతో తిమ్మమ్మ మర్రిమాను తోపాటు తిమ్మమాంబ ఆలయ అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.
ఆలయం పై ఆధారపడి జీవనం సాగిస్తున్న పూజారులు, చేస్తున్న సిబ్బంది ఉపాధికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. తిమ్మమ్మ మర్రిమాను ఆలయ సందర్శనకు వచ్చే పర్యాటకుల సౌకర్యాల పైన సమావేశంలో చర్చ సాగింది. విశిష్టతను మరింత పెంచే దిశగా అవసరమైన అన్ని చర్యలను అందరి సహకారంతో ప్రణాళికాబద్ధంగా చేపడతామని జిల్లా అటవీ శాఖ అధికారి జగన్నాథ్ సింగ్ తెలిపారు.

Conclusion:బైట్స్
మహేంద్ర, తిమ్మమ్మ మర్రిమాను యువసేన
శేఖర్, తిమ్మమాంబ ఆలయ కమిటీ సభ్యుడు
జగన్నాథ్ సింగ్, జిల్లా అటవీ శాఖ అధికారి , అనంతపురం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.