అనంతపురం జిల్లాలో ఒకే రోజు వేర్వేరు చోట్ల అగ్ని ప్రమాదాలు జరిగాయి. బేలుగుప్ప మండలం రామసాగరంలో మంగళవారం రాత్రి విద్యుదాఘాతంతో రాఘవేంద్ర అనే వ్యక్తి ఇల్లు దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది... ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. కాలువపల్లికి చెందిన సుధాకర్ తన వ్యవసాయ తోటలో రెండు వేల లీటర్ల సామర్థ్యం ఉన్న శుద్ధజల కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి విద్యుత్‌షార్ట్ సర్క్యూట్ కారణంగా సామగ్రి మొత్తం కాలిపోయింది. దీంతో సుమారు రూ.3లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు.
కక్కలపల్లి టమోటా మార్కెట్లో...
అనంతపురం నగర శివారు కక్కలపల్లి టమోటా మార్కెట్లో అగ్నిప్రమాదం జరిగింది. మార్కెట్లోని ఓ మండిలో దాదాపు వెయ్యి బాక్స్‌ల ప్లాస్టిక్ టమోటా బాక్సులు అగ్నికి ఆహుతయ్యాయని యజమాని మోహన్ తెలిపారు. దాదాపు రూ.రెండు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు మండి యజమాని తెలిపారు. మండికు వచ్చిన రైతులు వేసుకున్న చలి మంట నుంచి నిప్పురవ్వలు ఎగిరి అగ్ని ప్రమాదం జరిగిందన్నారు.
ఇదీ చదవండి