అనంతపురం జిల్లా సత్యసాయి జనరల్ ఆస్పత్రిలో మెరుగైన సేవలు అందించేందుకు ట్రస్టు నూతనంగా నిర్మించిన విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. సత్యసాయి మానవాళికి అందించిన సేవలు వెలకట్టలేనివని ఎల్వీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యసాయి భౌతికంగా మన మధ్య లేకున్నా ..భక్తుల హృదయాల్లో కొలువై ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య సేవలపై ప్రత్యేక కమిటీ వేయడం జరిగిందని ..అందులో జరిగే సమీక్షలో సత్యసాయి వైద్య సేవలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. తరువాత మహా సమాధిని ప్రత్యేకంగా దర్శించుకున్నాంతరం... సత్యసాయి సేవా కార్యక్రమాలపై ట్రస్టు సభ్యులతో చర్చించారు.
ఇదీచూడండి.ఆ కళాశాల అంతా సౌర వెలుగుల సౌరభం