తమిళనాడులో పట్టుబడిన నగదుపై బంగారం వ్యాపారి వివరణ ఇచ్చారు. అది బంగారం వ్యాపార లావాదేవీలకు సంబంధించిన నగదు అని.. వ్యాపారి నల్లమల్లి బాలరామ గిరీశ్ తెలిపారు. పోలీసులు పట్టుకున్నది అక్రమ నగదు కాదని.. నగదు రికార్డులను తమిళనాడు అధికారులకు అందిస్తాం అని వ్యాపారి స్పష్టం చేశారు. లాక్‌డౌన్ వల్ల 3 నెలలుగా నగదు తనవద్దే ఉండిపోయిందని బంగారం వ్యాపారి తెలిపారు. నగదును ఆభరణాల సరఫరాదారులకు ఇచ్చేందుకు తీసుకెళ్లామని చెప్పారు.ఆ నగదుకు, మంత్రి బాలినేనికి ఎలాంటి సంబంధం లేదని బంగారం వ్యాపారి పేర్కొన్నారు.
ఎమ్మెల్యే స్టిక్కర్‌తో ఉన్న కారులో తరలిస్తున్న రూ.5.27 కోట్లను తమిళనాడులోని గుమ్మిడిపూండి సమీపంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఒంగోలుకు చెందిన ముగ్గురిని అరెస్టు చేశారు. ఆ వాహనంపై ప్రకాశం జిల్లాకు చెందిన కీలక ప్రజాప్రతినిధి స్టిక్కర్ ఉండటం తీవ్ర కలకలం రేపింది.
ఇదీ చదవండి: ఏపీ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారులో రూ.5.27 కోట్ల నగదు