అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గణతంత్రదినోత్సవ ఏర్పాట్ల కోసం.. చెత్త చెదారాన్ని విద్యార్థినులతోనే ఉపాధ్యాయులు శుభ్రం చేయిస్తున్నారు. ప్రభుత్వం అమ్మ ఒడి పథకం నుంచి పరిసరాల శుభ్రత కోసం వినియోగించాలని ఒక్కొక్క విద్యార్థి నుంచి రూ. 1,000 కేటాయించింది.
ప్రభుత్వం నిధులు కేటాయించినప్పటికీ విద్యార్థినులతో ఇలా చేయించడం అమానుషం. కరోనా కారణంగా పాఠశాలలు కూడా చాలా ఆలస్యంగా తెరవడంతో చదువుకునే తీరిక లేక వారిని ఇబ్బందికి గురిచేయడం సరికాదు. ఇటువంటి సమయంలో చదువు పక్కన పెట్టించి.. వారితో పాఠశాల గ్రౌండ్ ను ఉపాధ్యాయులు శుభ్రం చేయిస్తున్నారు.
ఇదీ చదవండి: నామినేషన్ల ప్రక్రియ: ఆదేశాలు ఇవ్వని కలెక్టర్లు.. వెనక్కి వెళ్తున్న అభ్యర్థులు