పేద, బడుగు బలహీన వర్గాల పార్టీ తెదేపా అని అనంతపురం జిల్లా అధ్యక్షుడు పార్థసారథి అన్నారు. పార్టీ కార్యాలయం వద్ద మహానాడు సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేద ప్రజలను పట్టి పీడిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమ్మ ఒడితో డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం.. మద్యం ధరలు పెంచి తిరిగి వసూలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పార్టీలకు భవిష్యత్ ఉండదన్నారు. చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి చర్యలు చేపడుతున్నామని.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు.
ఇవీ చదవండి: