వైకాపా ప్రభుత్వానికి రాజకీయాలు తప్ప అభివృద్ధి మీద ఆలోచనే లేదని తెదేపా అనంతపురం పార్లమెంట్ ఇన్ఛార్జి జేసీ పవన్ రెడ్డి విమర్శించారు. సీఎం జగన్ ప్రత్యేక హోదా గురించి మర్చిపోయారని అరోపించారు. ప్రభుత్వం పథకాల నిధులను పక్కదారి పట్టిస్తుండటం వల్లనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అభివృద్ధి నిధులు కేటాయించలేదని అన్నారు. రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదని వైకాపా నేతలు ముసలి కన్నీరు కారుస్తున్నారని పవన్ రెడ్డి ఆక్షేపించారు.
ఇదీ చదవండి: 'తప్పు చేసినందుకే అచ్చెన్నాయుడుని అరెస్టు చేశారు'