ETV Bharat / state

అరాచక శక్తిగా కాపు రామచంద్రారెడ్డి.. సస్పెండ్ చేయండి సీఎం సార్​: కాల్వ - విప్​ను సస్పెండ్ చేయాలన్న కాల్వ

ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అరాచకాలకు రాయదుర్గం అడ్డాగా మారిందని తెదేపా పొలిట్​​బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. పోలీసులు ఆయనకు సహకరిస్తున్నారని ఆరోపించారు. సీఎం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

kalva fires on ysrcp party whip
కాల్వ శ్రీనివాసులు విమర్శలు
author img

By

Published : Jan 22, 2021, 6:50 AM IST

అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అరాచక శక్తిగా మారారని మాజీ మంత్రి, తెదేపా పొలిట్​​బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. కాపు రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి రాయదుర్గం ప్రాంతంలో అవినీతి అక్రమాలు మితిమీరాయని రాయదుర్గంలో ఆరోపించారు. యథేచ్ఛగా భూ కబ్జాలకు పాల్పడుతున్నాడంటూ ధ్వజమెత్తారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని వ్యాపారస్తులపై దాడులు చేయిస్తూ.. వేధింపులకు గురిచేస్తున్నాడని మండిపడ్డారు. ఎమ్మెల్యే అరాచకాలకు రాయదుర్గం అడ్డాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రామచంద్రారెడ్డి పై సీఎం జగన్ చర్యలు తీసుకొని.. సస్పెండ్ చేయాలని కోరారు. గత 20 నెలల్లో కాపు చేసిన అక్రమాలు, దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలపై ముఖ్యమంత్రి స్వయంగా సమీక్షించాలని కోరారు.

ఓటమి భయంతోనే ఎన్నికలు వాయిదా

రాష్ట్ర ప్రభుత్వం ఓటమి భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలను పదే పదే వాయిదా వేస్తోందని కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు న్యాయస్థానం సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిందన్నారు. ప్రజాభిప్రాయం ప్రభుత్వానికి అనుకూలంగా లేదని అధికార పార్టీ మద్దతుదారులు గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటమి భయంతో స్థానిక సంస్థల ఎన్నికలను ఎలాగైనా అడ్డుకోవాలని కుట్రలో భాగంగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.

మళ్లీ సుప్రీం కోర్టుకు వెళ్లాలనే ప్రయత్నం చేయడం నైతికంగా ఎన్నికల్లో ఓడిపోయినట్లేనని ఎద్దేవా చేశారు.ఇళ్ల పట్టాల పంపిణీకి అడ్డు రాని కరోనా నియమ నిబంధనలు.. వైకాపా నిర్వహిస్తున్న అనేక సభలు సమావేశాలకు అడ్డురాని కరోనా నియమాలు.. స్థానిక సంస్థలకు మాత్రమే అడ్డు వస్తున్నాయా అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసే అర్హత ప్రభుత్వానికి లేదన్నారు. జగన్ ప్రభుత్వానికి పంచాయతీ ఎన్నికలు ఎదుర్కొనే శక్తి , సామర్థ్యాలు లేవని స్పష్టంగా అర్థం అవుతోందని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి:

జగన్ అక్రమాస్తుల కేసు:ఈడీ ఛార్జ్‌షీట్లపై సీబీఐ కోర్టులో విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.