రహదారుల విస్తరణలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు సందేహాలకు తావిస్తోందని అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. కదిరి పట్టణంలోని హిందూపురం రోడ్డు విస్తరణను ఆరు నెలలుగా సర్వేకే పరిమితం చేశారని ఆరోపించారు. ఇంటి యజమానుల అభిప్రాయాన్ని తెలుసుకోకుండా టెండర్ ప్రక్రియ ముగిసిన తర్వాత నోటీసు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. రాయలసీమ కూడలి నుంచి కోనేరు వరకు రోడ్డుకిరువైపులా సొంత స్థలంలో నిర్మించుకున్న యజమానుల విషయంలోనూ అధికారులు వ్యవహరించిన తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు.
ట్రాన్స్ ఫర్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) చట్టం మేరకు ఇంటి యజమానులకు సమాచారం ఇచ్చిన తర్వాత వారి సమ్మతి మేరకే టీడీఆర్ తీసుకోవాలన్న నిబంధనలు అధికారులు విస్మరించారని కందికుంట వెంకటప్రసాద్ విమర్శించారు. అలా కాని పక్షంలో భూసేకరణ మేరకు ఇంటి యజమానులకు పరిహారం చెల్లించాకే విస్తరణ పనులు ప్రారంభించాలని సూచించారు. ఇంటి యజమానుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా బలవంతంగా విస్తరణ పనులు చేపడతామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. బాధితులకు అండగా తెలుగుదేశం పార్టీ నిలబడుతుందని చెప్పారు.
ఇదీ చదవండి: