ఎన్నికల్లో ఓటమి చూసి నిరుత్సాహపడకుండా రానున్న ఎన్నికల్లో ఉత్సాహంగా పని చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి చెప్పారు. అధికార పార్టీ బెదిరింపులు, దౌర్జనాలతో వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకొని ఆధిపత్యం సాధించారని ఆరోపించారు.
ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఇప్పటి నుంచే సేవా భావంతో పని చేయాలని కార్యకర్తలకు సూచిస్తామన్నారు. అధికార పార్టీ లోపాలను ప్రజలకు తెలియజేయడానికి తమ కార్యకర్తలు అందుబాటులో ఉంటారని.. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందన్న భరోసా కల్పిస్తామని ఆయన చెప్పారు.
ఇదీ చదవండి:
'ఆదాయం ఉన్న రైల్వే స్టేషన్ను ప్రైవేటీకరిస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది?'