ETV Bharat / state

ఏజెంట్ల ఓటర్​ లిస్ట్​లో తేడాలున్నాయంటూ తెదేపా నాయకుల ఆందోళన - పోలింగ్ కేంద్రం వద్ద తెదేపా నాయకుల ఆందోళన

అనంతపురం నగరంలోని 23వ డివిజన్​లోని 5వ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైకాపా నాయకులు.. తెదేపాకు ఇచ్చిన ఏజెంట్ల ఓటర్ లిస్ట్​లో తేడాలున్నాయంటూ తెదేపా అభ్యర్థులు ఆందోళనకు దిగారు.

tdp cadres fires on ycp at ananthapur 23rd division
ఏజెంట్ల ఓటర్​ లిస్ట్ పుస్తకాల్లో తెడాలున్నాయంటూ తెదేపా నాయకుల ఆందోళన
author img

By

Published : Mar 10, 2021, 1:36 PM IST

అనంతపురం నగరంలోని 23వ డివిజన్ 5వ పోలింగ్ కేంద్రం వద్ద కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైకాపాకు సంబంధించిన ఏజెంట్ల ఓటర్ లిస్ట్ పుస్తకాల్లో.. తేడాలున్నాయంటూ తెదేపా అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రం పీవోతో వాదనకు దిగారు. ఇంతలో పోలీసులు జోక్యం చేసుకొని ఇరువురికి సర్ది చెప్పారు. వైకాపా నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, అక్రమ పద్ధతిలో ఓట్లను కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని.. తెదేపా అభ్యర్థులు ఆరోపించారు. నగరంలోని పలు పోలింగ్ కేంద్రాలను.. డీఐజీ రాణా టాటా, జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు పరిశీలించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కువ మోతాదులో పోలీస్ బలగాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు.

ఇదీ చదవండి: స్వతంత్ర అభ్యర్థి భర్తపై జనసేన కార్యకర్తల దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.