సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్య సమస్యలు ఉండవని తెలియజేసేందుకు తమిళనాడుకు చెందిన విగ్నేష్ అనే యువకుడు సైకిల్ యాత్ర చేపట్టాడు. కశ్మీర్ నుంచి కన్యాకుమారికి తన ప్రయాణం ప్రారంభించాడు. ఇందులో భాగంగా శనివారం అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లికి చేరుకున్నాడు. ఇది తన చిరకాల కోరిక అన్నారు. మోటార్ సైకిల్ని వదిలి సైకిల్ ప్రయాణం చేయాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 9 రాష్ట్రాల్లో సైకిల్ యాత్రను పూర్తి చేసినట్లు వివరించారు. ప్రతి రోజు 100 నుంచి 150 కిలోమీటర్ల ప్రయాణం సాగిస్తున్నట్లు వివరించాడు. 3,500 కిలో మీటర్ల ప్రయాణంలో ప్రస్తుతం 2,500 కి.మీ సైకిల్ యాత్రను పూర్తి చేశానని తెలిపాడు. ఈ యాత్రకు ప్రజల నుంచి మంచి సహాయ సహకారాలు అందుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు, స్నేహితుల ప్రోత్సాహం వల్ల సంతోషంగా యాత్ర నిర్వహిస్తున్నానని తెలిపాడు.
ఇదీ చదవండి :