Municipal Chairman Anger On Spandana Program: జిల్లా కలెక్టర్ సమస్యలపై స్పందించకపోతే ఇక స్పందన కార్యక్రమం ఎందుకని.. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం సజ్జలదిన్నెలో భూ సంబంధిత సమస్యపై గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డి.. కలెక్టర్ నాగలక్ష్మిని కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై జిల్లా యంత్రాగం ఏ మాత్రం స్పందించకపోవటంతో.. మరోసారి ఫిర్యాదు చేయటానికి కలెక్టరేట్లో స్పందనకు వచ్చారు. తాను గతంలో ఇచ్చిన ఫిర్యాదుపై ఎందుకు స్పందించలేదని కలెక్టర్ నాగలక్ష్మిని, సంయుక్త కలెక్టర్ కేతన్‌గార్గ్‌ను ప్రశ్నించారు.
ఎమ్మెల్యేలు ఇచ్చిన ఫిర్యాదులకైతే అదేరోజు సాయంత్రానికే స్పందిస్తారు.. సామాన్యులు ఎన్నిసార్లు తిరిగినా చర్యలుండవా అని కలెక్టర్‌ను ప్రశ్నించారు. దీంతో కలెక్టర్.. జేసీకి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. స్పందనకు వచ్చే ప్రజలకు మేలు చేయండని,.. సమస్యలు పరిష్కరించండి అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహంగా స్పందన కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి బాధ్యతగా వ్యవహరించటం లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు.
ఇవీ చదవండి: