ETV Bharat / state

కరోనా బాధితుల నుంచి అధిక ఫీజుల వసూలు.. ఆసుపత్రి ఎండీ అరెస్ట్ - అనంతపురంలో అధిక కరోనా ఫీజుల వార్తలు

ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా కరోనా రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేసినందుకు అనంతపురం జిల్లా కేంద్రంలోని ఎస్వీ ఆసుపత్రి మేనేజింగ్ పార్టనర్‌ రవిబాబును అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు.

anantapuఅనంతపురం ఎస్పీ సత్యఏసుబాబు ram sp satya yesubabu
అనంతపురం ఎస్పీ సత్యఏసుబాబు
author img

By

Published : Apr 28, 2021, 9:36 PM IST

ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా జిల్లా కేంద్రంలోని ఎస్వీ ఆసుపత్రి యాజమాన్యం ఒక్కో కరోనా రోగి నుంచి రూ.30 వేల దాకా వసూలు చేసినట్లు ఎస్పీ తెలిపారు. దీంతో పాటు సదరు ఆసుపత్రికి ఏడు బెడ్లకు మాత్రమే అనుమతి ఇవ్వగా అంతకు మించి కొవిడ్‌ రోగులకు చికిత్స అందిస్తున్నారన్నారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న విజిలెన్స్‌ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ.. ఔషధ నియంత్రణ విభాగంతో కలిసి ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించారన్నారు. తనిఖీల్లో అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ కావడంతో ఆసుపత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేసి మేనేజింగ్‌ పార్టనర్‌ రవిబాబును అరెస్టు చేశామన్నారు.

జిల్లాలో నిబంధనలు విరుద్ధంగా పనిచేసే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒకవేళ ఎక్కడైనా అధిక ఫీజులు వసూలు చేస్తే బాధితులు హెల్ప్‌లైన్‌ నెంబరు 104కు ఫోన్‌ చేసి సమాచారమివ్వాలని సూచించారు. దీంతోపాటు కరోనాపై అసత్య ప్రచారాలు చేసేవారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు.

ఇదీ చదవండి: టింబర్ డిపోలో అగ్నిప్రమాదం..భారీగా ఆస్తి నష్టం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.