ETV Bharat / state

కొవిడ్ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు: సబ్ కలెక్టర్

పెనుకొండ పట్టణంలో దుకాణాలపై సబ్ కలెక్టర్ నిషాంతి ఆకస్మిక తనిఖీ చేశారు. కొవిడ్ నిబంధనలు పాటించని.. 20 షాపులను సీజ్ చేశారు. అనంతరం కొవిడ్ పై అవగాహన కల్పించారు.

author img

By

Published : May 3, 2021, 2:38 PM IST

sub collector visit penukonda
sub collector visit penukonda

అనంతపురం జిల్లా పెనుకొండలో కొవిడ్ నిబంధనలు పాటించని దుకాణదారులపై సబ్ కలెక్టర్ నిషాంతి కొరడా ఝుళిపించారు. పెనుకొండ పట్టణంలో షాపులపై సబ్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. కొవిడ్ నిబంధనలు పాటించని 20 షాపులను సీజ్ చేసి... జరిమానా విధించారు.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ అనవసరంగా బయట తిరగొద్దని... అత్యవసరమైన పని ఉంటేనే బయటకి వెళ్లాలని... మాస్క్ కచ్చితంగా ధరించాలని సబ్ కలెక్టర్ స్పష్టం చేశారు. దుకాణాల వద్ద ప్రజల గుంపులుగా ఉండరాదని... ప్రతి ఒక్కరు ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.... దుకాణాలు నిర్వహించాలని సూచించారు. ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించారు. సీఐ శ్రీహరి, ఎంపీడీవో శివ శంకర తదితర సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

సిబ్బంది ఉండరు... ప్రాణవాయువు అందదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.