అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని పలు గ్రామాల్లో బస్సు సౌకర్యం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకే ఆటోలో 20 మందికి పైగా ప్రయాణించడం వల్ల ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గురువారం ఉదయం కొంతమంది విద్యార్థులు ఒక ఆటోలో వెనుక వేలాడుతూ ప్రయాణించారు. ఏ ప్రమాదం జరగక ముందే అధికారులు వెంటనే స్పందించి బస్సులు లేని గ్రామాలకు బస్సులు ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.
ఇదీ చదవండి: ప్రత్యేక హోదా పేరు తప్ప.. ఆ రూపేణా చాలానే నిధులొచ్చాయ్..!