ETV Bharat / state

పెద్ద పంచాయతీలపై దృష్టి.. పాగా వేసేందుకు పార్టీల వ్యూహాలు - పంచాయతి ఎన్నికల తాజా వార్తలు

అనంతపురం జిల్లాలో 25 మేజర్‌ పంచాయతీలు ఉన్నాయి. అవి పేరుకే పంచాయతీలు.. ఆదాయం విషయాల్లో పట్టణాలకు ఏ మాత్రం తీసిపోవు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సంఘం నిధులు వస్తున్నా.. సొంత మార్గాలతోనే ఆదాయాన్ని పొందుతున్నాయి.

Strategies of the parties to focus on large panchayats
పెద్ద పంచాయతీలపై దృష్టి.. పాగా వేసేందుకు పార్టీల వ్యూహాలు
author img

By

Published : Feb 2, 2021, 1:14 PM IST

అవి పేరుకే పంచాయతీలు.. జనాభా, అభివృద్ధి, ఆదాయం విషయాల్లో పట్టణాలకు ఏమాత్రం తీసిపోవు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సంఘం నిధులు వస్తున్నా.. సొంత మార్గాల ద్వారానే ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నాయి. స్వయం పరిపాలన, స్వశక్తికి చిరునామాగా నిలుస్తున్నాయి. అనంతపురం జిల్లాలో 25 మేజర్‌ పంచాయతీలు ఉన్నాయి. అందులో పదివేల ఓటర్లు దాటి, రూ.కోటిపైగా ఆదాయం వచ్చేవి 10 ఉన్నాయి. ఇంటి పన్నులు, వారపు సంతలు, అద్దెలు, చేపల చెరువులు వంటి వాటి ద్వారా ఏటా రూ.50 లక్షల నుంచి రూ.కోటి దాకా ఆదాయం వస్తోంది. అందుకే ఈ పంచాయతీల్లో సర్పంచి పీఠాన్ని కైవసం చేసుకోవడం కోసం భారీ స్థాయిలో పోటీ పడుతున్నారు. ఎలాగైనా ఆ స్థానాలను దక్కించుకోవాలని ప్రధాన పార్టీలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి.
అన్ని స్థానాల్లోనూ మహిళలే..
జిల్లాలోని మేజర్‌ పంచాయతీల్లో ఉరవకొండ పెద్దది. ఇక్కడ దాదాపు 30 వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. దీంతోపాటు నారాయణపురం, బుక్కరాయసముద్రం, నార్పల, యాడికి, కణేకల్లు, సోమందేపల్లి, కొత్తచెరువు, చిలమత్తూరు, గోరంట్ల పంచాయతీల్లో 10 వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. వీటిలో అన్ని సర్పంచి స్థానాలను మహిళలకు కేటాయించారు. ఇందులో ఒక్క ఎ.నారాయణపురం మినహా మిగిలిన తొమ్మిది పంచాయతీలను ఎస్సీ మహిళలకు రిజర్వ్‌ చేశారు. ఆయా పంచాయతీల్లో ఉప సర్పంచులు కీలకం కానున్నారు.

చిలమత్తూరు
ఓటర్లు: 12,366
ఆదాయం: రూ.కోటి
ఆదాయ వనరులు: ఇంటి, కొళాయి పన్ను, చింతచెట్లు, చేపల చెరువు, స్టాంపు డ్యూటీ ద్వారా రూ.80 లక్షలు, కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ రూపాల్లో రూ.20 లక్షలు వస్తున్నాయి.
తాజా పరిస్థితి: సర్పంచి స్థానాన్ని ఎస్సీ మహిళకు కేటాయించారు. ఇక్కడ తెదేపా, వైకాపా రెండింటిలో వర్గపోరు ఉంది. మరోవైపు పోటీ తీవ్రంగా మారింది. వర్గపోరు నేపథ్యంలో తమకు కలిసి వస్తుందన్న ఉద్దేశంతో స్వతంత్ర అభ్యర్థులు పోటీలో నిలిచేందుకు ఉత్సాహం చూపుతున్నారు.

కణేకల్లు
ఓటర్లు: 16,352
ఆదాయం: రూ.1.50 కోట్లు
ఆదాయ వనరులు: ఇంటి పన్ను, వ్యాపార సముదాయాలు, స్టాంపు డ్యూటీలు, వృత్తి పన్ను ద్వారా రూ.50 లక్షలు, కేంద్ర ప్రభుత్వం నుంచి మరో రూ.కోటి దాకా నిధులు వస్తున్నాయి.
తాజా పరిస్థితి: ఈసారి ఎస్సీ మహిళకు కేటాయించారు. పంచాయతీ పోరు రసవత్తరంగా మారింది. తెదేపా, వైకాపా నుంచి ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. అభ్యర్థుల ఎంపిక ఇంకా ఖరారు కాలేదు.

సోమందేపల్లి
ఓటర్లు: 13,825
ఆదాయం: రూ.కోటిపైగా
ఆదాయ వనరులు: ఇంటి పన్నులు, స్టాంపు డ్యూటీ ద్వారా రూ.20 లక్షలు, వారపు సంతలు, చేపల చెరువు ద్వారా రూ.25 లక్షలు, కేంద్రం నుంచి రూ.60 లక్షలు వస్తున్నాయి.
తాజా పరిస్థితి: పంచాయతీ ఆవిర్భవించినప్పటి నుంచి మొదటిసారి ఎస్సీ మహిళకు కేటాయించారు. దీంతో ఆ సామాజిక వర్గంలో పట్టున్న అభ్యర్థుల ఎంపిక కోసం తెదేపా, వైకాపా కసరత్తు చేస్తున్నాయి.

నార్పల
ఓటర్లు: 16,330
ఆదాయం: రూ.2 కోట్లు
ఆదాయ వనరులు: ఇంటి పన్ను, వ్యాపార సముదాయాలు, రైస్‌ మిల్లులు, వారపు సంతలు, రవాణా వాహనాల నుంచి ఫీజులు, లేఅవుట్ల అనుమతుల ద్వారా రూ.కోటి దాకా వస్తోంది. కేంద్ర నిధులు రూ.కోటి దాకా ఇస్తున్నారు.
తాజా పరిస్థితి: మొదటిసారి ఎస్సీ మహిళకు కేటాయించారు. సర్పంచి స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. వైకాపాలో రెండు వర్గాలుగా విడిపోయారు. తెదేపా బలమైన అభ్యర్థి కోసం కసరత్తు చేస్తోంది.

కొత్తచెరువు
ఓటర్లు: 11,253
ఆదాయం: రూ.1.50 కోట్లు
ఆదాయ వనరులు: ఇంటి పన్నులు, భవన నిర్మాణ అనుమతులు, స్టాంపుడ్యూటీ, మార్కెట్లు, వ్యాపార సముదాయాల ద్వారా ఏటా రూ.1.50 కోట్ల ఆదాయం వస్తోంది. మెరుగైన రవాణా సౌకర్యం ఉండటంతో మరో రూ.కోటి ఆదాయం పెంచుకునే అవకాశం ఉంది.
తాజా పరిస్థితి: ఆరు దశాబ్దాల తర్వాత ఎస్సీ మహిళకు కేటాయించారు. ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు వైకాపా, తెదేపా మద్దతుదారులు నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతున్నారు.

గోరంట్ల
ఓటర్లు: 19,616
ఆదాయం: రూ.2.66 కోట్లు
ఆదాయ వనరులు: ఇంటి, కొళాయి పన్నులు, మార్కెట్‌ వేలం, జేఆర్‌వై గదులు, రవాణా వాహనాలు, వ్యాపార సముదాయాలు, ఆర్థిక సంఘం నిధుల ద్వారా సుమారు రూ.2.66 కోట్లు సమకూరుతోంది.
తాజా పరిస్థితి: పంచాయతీ ఏర్పడిన తర్వాత మొదటిసారి ఎస్సీ మహిళకు కేటాయించారు. దీంతో అభ్యర్థుల ఎంపిక కోసం పార్టీలు తీవ్ర కసరత్తు చేయాల్సి వస్తోంది. ప్రధానంగా వైకాపా, తెదేపా మద్దతుదారుల మధ్య పోటీ నెలకొంది.

ఎ.నారాయణపురం
ఓటర్లు: 14,125
ఆదాయం: రూ.3 కోట్లు
ఆదాయ వనరులు: ఇంటి పన్ను, లేఅవుట్ల అనుమతులు, స్టాంపుడ్యూటీ, భవనాల అద్దెల ద్వారా ఏటా సుమారు రూ.3 కోట్ల ఆదాయం వస్తోంది. ఆర్థిక సంఘం నిధులు రూ.20 లక్షలు వస్తున్నాయి.
తాజా పరిస్థితి: ఈ పంచాయతీని బీసీ మహిళకు కేటాయించారు. 2013లో తెదేపా మద్దతుదారు విజయం సాధించారు. ఈసారీ స్థానాన్ని దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. అధికార వైకాపా ఇక్కడ పాగా వేయాలని ప్రయత్నాలు చేస్తోంది. గతంలో ఇదే పంచాయతీ పరిధిలో ఉన్న పాపంపేటను విభజించారు. దీనిపై కొందరు కోర్టుకు వెళ్లడంతో ఇక్కడ ఎన్నికలపై సందేహం వ్యక్తమవుతోంది.

ఉరవకొండ
ఓటర్లు: 30,307
ఆదాయం: రూ.2.50 కోట్లు
ఆదాయ వనరులు: రోజువారీ సంతలు, ఇంటి, కొళాయి పన్నులు, గొర్రెలు, మేకల మార్కెట్లు, మాంసం దుకాణాలు, మరుగుదొడ్లు, లేఅవుట్ల అనుమతులు, స్టాంప్‌ డ్యూటీల ద్వారా ఏటా రూ.1.50 కోట్ల ఆదాయం వస్తోంది. కేంద్రం నుంచి మరో రూ.కోటి నిధులు సమకూరుతున్నాయి.
తాజా పరిస్థితి: ఎస్సీ మహిళకు కేటాయించారు. వైకాపాలో వర్గపోరు నడుస్తోంది. ఇక్కడ ఆ పార్టీ నాయకులు మూడు వర్గాలుగా విడిపోయారు. తెదేపా నుంచి బలమైన నాయకుడిని బరిలో నిలిపేందుకు ఎమ్మెల్యే కసరత్తు చేస్తున్నారు.

యాడికి
ఓటర్లు: 18,727
ఆదాయం: రూ.1.20 కోట్లు
ఆదాయ వనరులు: స్టాంపు డ్యూటీ, ఇంటి పన్నులు, జంతువధశాల టెండరు, వారపు సంత, అద్దెల ద్వారా రూ.30 లక్షలు, కేంద్ర ప్రభుత్వ నిధులు రూ.90 లక్షల దాకా వస్తున్నాయి.
తాజా పరిస్థితి: ఎస్సీ మహిళకు కేటాయించారు. గతంలో ఇక్కడ వైకాపా నుంచి పోటీ చేసి గెలిచిన మహిళకే మళ్లీ అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆమెకు పోటీగా బలమైన అభ్యర్థి ఎంపిక కోసం తెదేపా కసరత్తు చేస్తోంది.

ఇదీ చదవండి:

ఏకగ్రీవాలకు వ్యతిరేకం కాదు.. పారదర్శకంగా జరగాలి: ఎస్ఈసీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.