పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ... ప్రకాశం జిల్లా చీరాలలో ఏఐటీయూసీ నాయకులు ఆందోళన నిర్వహించారు. కేంద్రం ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గితే... భారతదేశంలో మాత్రం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని విమర్శించారు. పెరిగిన పెట్రో ధరలకు నిరసనగా తిరుపతిలో తోపుడుబండితో సీపీఐ నేతలు ర్యాలీ నిర్వహించారు.
కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ నడ్డి విరుస్తున్నారని అనంతపురంలో సీపీఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజిల్, పెట్రోల్ పై పన్ను భారం తగ్గించి పెంచిన ధరలను తగ్గించాలంటూ యర్రగొండపాలెంలో డిమాండ్ చేశారు.
ఇదీచదవండి.