ETV Bharat / state

నిధుల కొరతతో సతమతమోతున్న అనంతపురం ప్రభుత్వాసుపత్రి

అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో నిధుల కొరత వేధిస్తోంది. ఆసుపత్రిలో రోజువారీ ఖర్చులను అధిగమించటం అధికారులతు కత్తిమీద సాములా మారింది. సర్జికల్ వస్తువుల కొనుగోలుకు ఏడాది కాలంగా నిధులు అందటం లేదు. ఆసుపత్రి వార్డుల్లో వైద్యులు, నర్సులకు రోజూ ఇవ్వాల్సిన చేతితొడుగులు సమకూర్చటం కూడా కష్టంగా మారింది. వాడిపడేసే సర్జికల్ వస్తువులు జెమ్ ఆన్ లైన్ పోర్టల్ ద్వారా రోజూ కొనుగోలు చేస్తున్నారు.

lack of hospital   funds
నిధుల కొరతతో సతమతమోతున్న అనంతపురం ప్రభుత్వాసుపత్రి
author img

By

Published : Jan 15, 2021, 6:03 AM IST

అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో నిధుల కొరతతో చేతి తొడుగులు కొనటం సమస్యగా మారింది. బోధనాసుపత్రికి వచ్చే మందుల బడ్జెట్ లో ఇరవై శాతం నిధులను నగదు రూపంలో నేరుగా పాలనాధికారి ఖాతాకు జమచేస్తారు. ఆసుపత్రికి ఏటా 6.85 కోట్ల రూపాయల మందులు కేటాయిస్తున్నారు. అత్యవసర మందులకు 1.20 కోట్లు, సర్జికల్ వస్తువుల కోనుగోలుకు 67 లక్షల రూపాయలు ఏటా నగదు రూపంలో ఇస్తున్నారు.

సర్జికల్ వస్తువుల సంగతేంటి...

మందుల కొనుగోలు నిధులు పుష్కలంగా ఉన్నప్పటికీ, సర్జికల్ వస్తువుల కొనుగోలుకు ఏడాది కాలంగా ఒక్కరూపాయి కూడా ఖాతాకు జమకాలేదు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి 48 లక్షల రూపాయలే ఇచ్చారు. 2020-21 ముగిసినప్పటికి నేటికీ ఒక్క రూపాయ కూడా అందలేదు. ఈ నిధులు రాకపోవటంతో ఆసుపత్రిలో రోజూవారీగా వైద్యులు, నర్సులకు చేతి తొడుగులు సమకూర్చుటం కూడా అధికారులకు సమస్యగా మారింది. ఏరోజు కారోజు 3000 చేతితొడుగులు ప్రభుత్వ జెమ్ పోర్టల్ నుంచి ఆన్ లైన్ లో కొనుగోలు చేస్తున్నారు. సర్జికల్ వస్తువుల కొనుగోలుకు నిధుల కొరత ఉందని అధికారులు చెబుతున్నారు.

సమస్యల సంద్రంగా మారిన ఆసుపత్రి

అనంతపురం ఆసుపత్రిలోని వార్డుల్లో ప్రతిరోజూ ఏదో ఒక సమస్య తలెత్తుతుంది. కరోనా వైరస్ విజృంభణ కారణంగా ఐదు నెలలపాటు ప్రధాన ఆసుపత్రిని కరోనా వైద్యానికి కేటాయించారు. దీంతో అన్నివార్డుల్లో విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు ఇతర ఎలక్ట్రికల్ వస్తువులను పెద్దఎత్తున వినియోగించటంతో పాత వైరింగ్ లో షార్ట్ సర్క్యూట్లు ఏర్పడ్డాయి. వీటికి ఎప్పటి కప్పుడు మరమ్మత్తు చేయాల్సిరావటంతో వ్యయం పెరిగింది. ఏసీలు, కంప్యూటర్లు, వైద్య యంత్రాల స్పల్ప రిపేర్లకు ఊహించని ఖర్చులు అనేకం ఎదురౌతున్నాయి. వీటన్నింటికీ ప్రతినెలా కనీసం నాలుగు లక్షల రూపాయలు అవసరం ఉంటుంది. ఈ నిధులన్నీ హెచ్​డీఎస్ ఖాతా నుంచి వెచ్చించుకోవాల్సి ఉంది.

నిధుల మార్గాలు శూన్యం..

ఆసుపత్రిలో వ్యాపార సముదాయాలు, ఇతరత్రా స్థిర ఆదాయ వనరులు లేకపోవటంతో హెచ్​డీఎస్ ఖాతాకు ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి వచ్చే నిధులు తప్పవేరేలేవు. కరోనా కారణంగా ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలు జరగకపోవటంతో ట్రస్టు నుంచి నిధులు రావటంలేదు.

ఎన్ని సమస్యలు ఉన్నా రోగుల సేవలు మరువం...

ఎన్ని ఇబ్బందులున్నా రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సూపరింటెండెంట్ చెబుతున్నారు. ఓవైపు సర్జికల్ వస్తువుల కొనుగోలుకు నిధుల కొరత వేధిస్తుంటే, నగరంలోని సూపర్ స్పెషాలిటీ, క్యాన్సర్ ఆసుపత్రులను ప్రధాన ఆసుపత్రికి అనుసంధానం చేశారు. ఆ రెండు ఆసుపత్రులకు చేతి తొడుగులు మొదలు, ఇతర సర్జికల్ వస్తువులన్నీ సమకూర్చలేక అధికారులు సతమతమవుతున్నారు.

నిధుల కొరతతో సతమతమోతున్న అనంతపురం ప్రభుత్వాసుపత్రి

ఇదీ చదవండీ..పెళ్లైన నెల రోజులకే భర్త మరణం.. శోకసంద్రంలో భార్య..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.